కోవిడ్ 19 తో వల్ల భారత చిత్ర పరిశ్రమ ఎంతో నష్టపోయింది… సుమారు మూడు నెలలు సినిమా షూటింగ్ లు థియేటర్లు మూత పడటంతో కోట్లల్లో నష్టం వాటిల్లింది… అయితే ఇటీవలే సోషల్ డిస్టెన్స్ పాటిస్తూ షూటింగ్ మొదలవుతున్నా ప్రతీ ఒక్కరిలో కరోనా భయం మాత్రం పోకుంది…
హీరో హీరోయిన్లు క్యారెక్టర్ కు ప్రాయార్టీ ఉన్న వారు సోషల్ డిస్టెన్స్ పాటించకుండా నటించాల్సి ఉంది… దీంతో ప్రతీ ఒక్కరు భయంతో ఉన్నారు… ఈక్రమంలో హీరోయిన్ కీలక నిర్ణయం తీసుకుంది… ఇక నుంచి తాను ముద్దులు కౌగిలింతలు, శృంగార సన్నివేశాల్లో నటించనని చెప్పింది రెజీనా…
తాజాగా ఓ ప్రముఖ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ ఇక నుంచి తాను నటించే చిత్రాల్లో లిప్ లాక్ సీన్స్ అలాగే బెడ్ రూమ్ సీన్స్ లలో నటించనని తెలిపింది… తిరిగి పాత రోజుల వస్తే అటువంటి సీన్స్ చేయడానికి అభ్యంతరం లేదని రెజీనా చెప్పింది…