బాలీవుడ్‌లోకి అడుగు పెట్టాలనేది చాలా మంది తారల కోరికగా ఉంటుంది. సొంత రాష్ట్ర సినీ పరిశ్రమలో మంచి పేరొచ్చినా బాలీవుడ్‌లోకి వెళ్లడానికే చాలా మంది ఆసక్తి చూపుతుంటారు. ఇది హీరోయిన్లో మరింత అధికంగా కనిపిస్తుంటుంది. అలా చాలా మంది బాలీవుడ్ బాట పట్టి భేష్ అనిపించుకుంది. వారిలో రెజినా క్యాసాన్‌డ్రా(Regina Cassandra) కూడా ఒకరు. ‘ఏక్ లడ్కీ కో దేఖాతో ఐసా లగా’ సినిమాతో అమ్మడు 2019లో బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న రెజీనా.. బాలీవుడ్‌లో తన ఎక్స్‌పీరియన్స్‌ను పంచుకుంటూ ఆ బీటౌన్‌పై కీలక వ్యాఖ్యలు చేసిందీ ముద్దుగుమ్మ. బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన తర్వాత నటులు ఎదుర్కొనే సవాళ్ల గురించి కూడా రెజీనా మాట్లాడింది.
‘‘దక్షిణాది నుంచి బాలీవుడ్‌లోకి(Bollywood) అరంగేట్రం చేసే ఎంతోమంది భాషాపరమైన సమస్యలు ఎదర్కొంటారు. భాష విషయంలో స్పష్టత లేకపోతే.. అవకాశాలు ఇవ్వడానికి చాలా మంది ఆసక్తి చూపరు, దక్షిణాదిలో ఇలా ఉండదు. హిందీ సినిమాల్లో నటించాలని నేను నిర్ణయం తీసుకున్నప్పుడు.. ముంబైలోనే ఉండాలని, మీటింగ్స్‌లో పాల్గొనాలని నాకు చెప్పారు. నాకు అది పెద్దగా నచ్చకపోయినా అదే ఇక్కడ ముఖ్యమని అర్థమైంది. నాకంటూ ఒక టీమ్ ఉంటుంది. అవకాశాల విషయంలో ఆ టీమ్ నాకు సహాయం చేస్తుంటుంది. నేను కేవలం ఆడిషన్లలో పాల్గొంటా. ఇతర పరిశ్రమలతో పోలిస్తే బాలీవుడ్‌లో పోటీ ఎక్కువ’’ అని చెప్పుకొచ్చింది ఈ చిన్నది(Regina Cassandra).