తెలుగు చిత్ర సీమకు ఎంతో మంది హీరోలు పరిచయం అయ్యారు… కొందరు మంచి ఫేమ్ సంపాదించుకుని సక్సెస్ అయ్యారు.. మరికొందరు తర్వాత సినిమా అవకాశాలు రాక చిత్ర సీమ నుంచి దూరంగా వెళ్లిపోయారు.. అయితే తెలుగులో అబ్బాస్
తమిళ్ దర్శకుడు కాతిర్ తెరకెక్కించిన ప్రేమ దేశం సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి పరిచయం అయ్యారు, ఆ సినిమాతో అతనికి ఎంతో మంచి పేరు వచ్చింది.
ఈ సినిమా తర్వాత వరుసగా సినిమా అవకాశాలు వచ్చాయి, కాని పెద్ద విజయాలు రాలేదు.. తర్వాత క్యారక్టర్ ఆర్టిస్ట్ రొల్స్ చేశారు అబ్బాస్… 2007 లో అనసూయ సినిమాలో అబ్బాస్ రోల్ కి మంచి పేరు వచ్చింది, ఇక సినిమా పరిశ్రమకు తర్వాత గుడ్ బై చెప్పి ఆయన అక్కడ నుంచి న్యూజిలాండ్ వెళ్లిపోయారు.
ఇక ఆయన అక్కడకు వెళ్లిన సమయంలో కూడా ఆర్దిక కష్టాలు వచ్చాయి… అయినా వాటిని ఎదుర్కొన్నారు..
అక్కడ అలా అనేక కష్టాలు ఎదుర్కొని ఓ వ్యాపారం ప్రారంభించారు… అలా కన్స్ట్రక్షన్ బిజినెస్ లోకి అడుగు పెట్టి మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నారు… అక్కడే వ్యాపారంలో స్దిరపడ్డారు ఆయన…. అందుకే ఆయనని యువత రోల్ మోడల్ గా తీసుకోవాలి అంటారు టాలీవుడ్ పెద్దలు.