బిగ్ బాస్ సీజన్ 5 ఈ 19 మంది కంటెస్టంట్ల రెమ్యునరేషన్స్ ఎంతంటే ?

Bigg Boss Season 5 What are the Remunerations of these 19 Contestants?

0
255

తెలుగు బిగ్ బాస్ సీజన్ 5 స్టార్ట్ అయింది. ఇక రెండు రోజులుగా కంటెస్టెంట్స్ ఆటని అభిమానులు చూస్తున్నారు. గేమ్ మరింత ఆసక్తిగా మారుతోంది. తొలి రోజు సరదా పరిచయాలతో చిల్ అయ్యారు. కాని రెండో రోజు నుంచి నామినేషన్ ఘట్టంతో సీన్ మారింది. దీంతో ఈసారి గత సీజన్ కంటే భారీ రెస్పాన్స్ వస్తుంది అంటున్నారు అందరూ. ఈసారి ఏకంగా 19 మంది కంటెస్టంట్లను హౌస్లోకి తీసుకొచ్చారు.

మరి వీరికి ఎంత పారితోషికాలు ఇస్తున్నారు అనే దానిపై సోషల్ మీడియాలో అనేక వార్తలు వినిపిస్తున్నాయి. నటరాజ్ మాస్టర్, విశ్వ, వీజే సన్నీ,, శ్వేత వర్మ, ఆర్జే కాజల్, మానస్ నాగులపల్లి, 7 ఆర్ట్స్ సరయు రాయ్ ,సిరి హన్మంత్, ప్రియాంక సింగ్, హమిద వీరికి వారానికి 40 నుంచి 70 వేల రూపాయలు రెమ్యునరేషన్ అనే వార్తలు వినిపిస్తున్నాయి.

ఉమా దేవి, ప్రియ, లహరి, సింగర్ శ్రీరామ చంద్రలకు వారానికి 1 నుంచి 1.5 లక్షల వరకు ఇస్తున్నారట. ఇక లోబోకి వారానికి 1.5 నుంచి 2 లక్షలు ఉండవచ్చు అంటున్నారు. యాంకర్ రవి, షణ్ముఖ్, జస్వంత్, అనీ మాస్టర్లు వారి పాపులారిటీని బట్టి 2 నుంచి 3 లక్షల వరకు ఉండచ్చు అంటున్నారు. ఇక నాగార్జునకి దాదాపు 10 నుంచి 12 కోట్ల రెమ్యునరేషన్ ఉండే అవకాశం ఉంది అంటున్నారు.

** కేవలం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వార్త మాత్రమే.