స్టార్​ హీరోలతో సమానంగా ఆ కమెడియన్ కు రెమ్యునరేషన్! ఇంతకీ అతను ఎవరంటే?

Remuneration to that comedian equal to Star Heroes!

0
92

తెలుగు చిత్ర పరిశ్రమలో అద్భుతమైన నటుల పేర్లలో రాజబాబు పేరు తప్పకుండా ఉంటుంది. తెలుగు చిత్ర పరిశ్రమలో ఎన్నో వెలకట్టలేని పాత్రలు పోషించి మనందరినీ నవ్వించాడు. ఆయన ఏ సినిమాలో పోషించిన ఆ సినిమా సగం హిట్టయినట్టే అన్నది ఆనాటి దర్శక-నిర్మాతల నమ్మకం.ఆయన పాఠశాలలో చదువుకునే రోజుల్లోనే బుర్రకథ, హరికథలతో నవ్వులు పంచేవారట. స్టేజ్‌ ఆర్టిస్ట్‌గా పేరు తెచ్చుకున్న తర్వాత సినిమా అవకాశాల కోసం మద్రాసు వెళ్లారు. కెరీర్‌ తొలినాళ్లలో అవకాశాలు లభించక ట్యూషన్లు చెప్పుకొంటూ బతికారు.

అల ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించిన రాజబాబు ఒకానొక దశలో హీరోలకు సమానంగా పారితోషికం అందుకునేవారట. ఒక సినిమాలో హీరోగా ఎన్టీఆర్ పారితోషికం 35వేల రూపాయలు. రాజబాబు పారితోషికం 20 వేల రూపాయలుగా నిర్ణయించారు నిర్మాత. తనకూ 35 వేల రూపాయలు కావాల్సిందేనని పట్టుపట్టారు రాజబాబు. ‘ఎన్టీఆర్ హీరో.. మీరు కమెడియన్’ అని నిర్మాత అంటే, ‘అయితే హీరోనే కమెడియన్‌గా చూపించి సినిమాను విడుదల చేయండి’ అని సమాధానం ఇచ్చారట.

జగపతి వారి ‘అంతస్తులు’ సినిమాలో నటించినందుకు రాజబాబు అందుకున్న పారితోషికం 1300 రూపాయలు. రాజబాబు తొలిసారిగా తీసుకున్న పెద్ద మొత్తం అదే. ఆ తరువాత హీరోలతో సమానంగా పారితోషికం తీసుకున్న సందర్భాలు చాలానే ఉన్నాయి. అయిదు రూపాయల కోసం గంటల తరబడి టి.నగర్‌లో నిలబడిన చోటు ముందు లక్ష రూపాయల ఖరీదైన కారులో వెళ్తూ గతాన్ని తలచుకుని కన్నీరు పెట్టుకునేవారట. తనలా కష్టాలు పడుతున్న చాలామందిని అప్పట్లో ఆదుకున్నారు