రెండోసారి అక్షయ్‌ కుమార్ భారీ విరాళం

రెండోసారి అక్షయ్‌ కుమార్ భారీ విరాళం

0
96

డ‌బ్బు ఉంటే చాల‌దు సాయం చేసే మ‌న‌సు ఉండాలి… అది బాలీవుడ్ లో హీరో అక్ష‌య్ కు చాలా ఉంది అనేది తాజాగా తెలిసింది, ఇప్పుడు కోవిడ్ 19 తో దేశం అల్లాడుతోంది, ఈ స‌మ‌యంలో పేద‌ల‌కు అభాగ్యుల‌కి సాయం అందిస్తున్నారు, ఈ స‌మ‌యంలో పీఎం కూడా విరాళాల‌కు పిలుపునిచ్చారు.

ఈ స‌మ‌యంలో అక్ష‌య్ కుమార్ రూ.25 కోట్లు పీఎం-కేర్స్‌కు విరాళం ప్రకటించారు, ఇక తాజాగా మ‌రో విరాళం ప్ర‌క‌టించారు ఆయ‌న‌…. బృహన్ ముంబయి మున్సిపల్‌ కార్పొరేషన్‌ బీఎంసీ కు రూ.3 కోట్లు విరాళంగా ప్రకటించారు. వైద్య సిబ్బంది, పారిశుద్ధ్య సిబ్బందికి వ్యక్తిగత సంరక్షక పరికరాల పీపీఈకోసం ఈ మొత్తాన్ని ఉపయోగించనున్నారు.

దీంతో ఇప్పుడు ఆయ‌న చేసిన సాయంతో వారికి అన్నీ కొత్త కిట్లు అందించ‌నున్నారు, మ‌న కోసం వైద్యులు న‌ర్సులు పోలీసులు ఎంతో సాయం చేస్తున్నారు మ‌నం వారికి ఏమైనా చేయాలి అని అన్నారు, నిజంగా అక్ష‌య్ చేసిన సాయంతో అంద‌రూ కూడా ఆయ‌న‌ని గ్రేట్ హీరో అంటున్నారు.