కొరియోగ్రాఫర్ శివశంకర్ మాస్టర్ కన్నుమూశారు. కరోనాతో హైదరాబాద్ లోని AIG ఆస్పత్రిలో ఆయన చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. శివశంకర్ మాస్టర్ పెద్ద కుమారుడికి కూడా కరోనా సోకి అపస్మారక స్థితిలో ఉన్నట్లు డాక్టర్లు పేర్కొన్నారు.
కొరియోగ్రాఫర్‌గా శివశంకర్ మాస్టర్ పదికిపైగా భాషల్లో సేవలందించారు. 800కుపైగా చిత్రాలకు డ్యాన్స్ మాస్టర్‌గా పని చేసిన అనుభవముంది. తెలుగులో ‘మగధీర’ సినిమాలోని ‘ధీర.. ధీర’ పాటకు ఉత్తమ కొరియోగ్రాఫర్‌గా జాతీయ అవార్డు అందుకున్నారు. నటుడిగానూ వెండితెరపై అలరించారు. 30కి పైగా చిత్రాల్లో నటించిన ఆయన.. నాలుగుసార్లు తమిళనాడు ప్రభుత్వం నుంచి అవార్డులు అందుకున్నారు. పలు టీవీ షోలకు జడ్జ్‌గా వ్యవహరించి బుల్లితెరపై తన మార్క్ చూపించారు.