పవన్‌కే నా మద్దతు.. ఒక్కసారి అవకాశం ఇవ్వండి: రేణూ దేశాయ్

-

ఇటీవల జనసేన అధినతే పవన్‌ కల్యాణ్, మెగాస్టార్ చిరంజీవిలపై వైసీపీ నేతలు విమర్శల వర్షం కురిపిస్తున్న సంగతి తెలిసిందే. ఈ తరుణంలో పవన్ మాజీ భార్య రేణూ దేశాయ్(Renu Desai) ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తొలి నుంచి రాజకీయాల్లో పవన్‌(Pawan Kalyan)కు సపోర్ట్ చేస్తూనే ఉన్నానని తెలిపారు. పవన్ ఓ అరుదైన వ్యక్తి అని.. డబ్బు మనిషి కాదని.. సమాజం కోసం ఏదైనా చేయాలని పరితపించే వ్యక్తి అంటూ ఆమె కొనియాడారు. ఈ మేరకు ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ వీడియోను రిలీజ్‌ చేశారు.

- Advertisement -

“నేను నా జీవితంలో ముందుకు సాగిపోతున్నా. స‌మాజానికి మంచి చేయాల‌ని ప‌వ‌న్ రాజ‌కీయాల్లోకి వ‌చ్చారు. నాకు తెలిసినంత వ‌ర‌కు ఇలాంటి వ్య‌క్తులు చాలా అరుదుగా ఉంటారు. ఆయ‌న డ‌బ్బు మ‌నిషి కాదు. స‌మాజం, పేద‌వాళ్ల సంక్షేమం కోసం ప‌ని చేయాల‌నుకుంటారు. నా వ్య‌క్తిగ‌త బాధ‌ను ప‌క్క‌న‌పెట్టి రాజ‌కీయంగా త‌న‌కు ఎప్పుడు మ‌ద్దతుగా ఉంటా” అన్నారు.

“ప‌వ‌న్ త‌న వ్య‌క్తిగ‌త జీవితాన్ని ప‌క్క‌న‌బెట్టి రాజ‌కీయాల్లోకి వ‌చ్చారు. ఎన్నిక‌లు వ‌స్తున్నాయ‌ని, ప‌వ‌న్‌కు ఒక్క‌సారి అవ‌కాశం ఇచ్చి చూడాలి. ఇది తాను ఆయ‌న మాజీ భార్య‌గా చెప్ప‌డం లేద‌ని, స‌మాజంలో ఓ పౌరురాలిగా మాత్ర‌మే అడుగుతున్నా. ప్ర‌తీసారీ ఆయ‌న వ్య‌క్తిగ‌త జీవితం గురించి మాట్లాడ‌వొద్దు. పవన్‌ పెళ్లిళ్లపై సినిమా తీస్తామని, వెబ్ సిరీస్ చేస్తున్నట్లు చెప్పడం తన దృష్టికి వచ్చింది. ఓ తల్లిగా అభ్యర్థిస్తున్నా దయచేసి పిల్లలను మీ రాజకీయాల్లోకి లాగకండి” అంటూ రేణూ(Renu Desai) విజ్ఞప్తి చేశారు.

ఇక రేణూ దేశాయ్ సినిమాల విషయానికి వస్తే.. ప్రస్తుతం మాస్ మహారాజా రవితేజ హీరోగా నటిస్తోన్న ‘టైగర్ నాగేశ్వరరావు’ అనే పాన్‌ ఇండియా మూవీలో కీలకపాత్రలో ఆమె నటిస్తున్నారు. ఈ సినిమాలో హేమలత లవణం అనే పాత్రలో కనిపించనున్నారని తెలుస్తోంది. ఈ సినిమా దసరా కానుకగా అక్టోబర్ 20న విడుదలకానుంది.

Read Also: హాట్ టాపిక్ గా మారిన ఎంపీ విజయసాయిరెడ్డి వ్యాఖ్యలు
Follow us on: Threads, Google News, Koo, Twitter, ShareChat

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Jio Fiber | యూజర్లకు జియో సూపర్ ఆఫర్

రిలయన్స్ జియో సంస్థ తమ కస్టమర్లకు గుడ్ న్యూస్ చెప్పింది. జియో...

The Raja Saab | ప్రభాస్ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్.. సంక్రాంతికి స్పెషల్ సర్ప్రైజ్

స్టార్ హీరో ప్రభాస్(Prabhas) అప్ కమింగ్ మూవీవ్ లో రొమాంటిక్ కామెడీ...