రేణూదేశాయ్ ఆసక్తికర వ్యాఖ్యలు

రేణూదేశాయ్ ఆసక్తికర వ్యాఖ్యలు

0
102

రేణూదేశాయ్ పవన్ నుంచి విడిపోయన తర్వాత తెలుగు సినిమా ఇండస్ట్రీకి దూరంగానే ఉంటున్నారు.. అప్పుడప్పుడూ షోలు పలు బుల్లితెర ఫ్రోగ్రామ్స్ లో మాత్రమే కనిపిస్తున్నారు. తాజాగా పెళ్లి చూపులు,మెంటల్ మదిలో చిత్రాలను నిర్మించిన రాజ్ కందుకూరి, తన కుమారుడు శివను హీరోగా ఇంట్రడ్యూస్ చేస్తూ చూసీ చూడంగానే చిత్రం నిర్మించారు. ఈ సినిమా కి ముఖ్య అతిధిగా రేణూదేశాయ్ వచ్చారు.

ఈ సమయంలో ఆమె పలు కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ సినిమాలో తనకు తల్లి పాత్రను దర్శకుడు ఆఫర్ చేశారని, అయితే తనకు ఆరోగ్యం బాగాలేక చేయలేదని చెప్పారు. ఆ పాత్ర తనకు నచ్చిందని చెప్పారు. అయితే ఆరోగ్యం బాగాలేక చేయలేదు.. లేకపోతే చేసేదానిని అని ఆమె చెప్పారు. ఈ సినిమాలో సంగీతం చాలా బాగుందని ఆమె చెప్పారు.

ఇక తర్వాత సినిమాలో అవకాశం వస్తే నటిస్తాను అని చెప్పారు ఆమె. సినీ పరిశ్రమలోకి మహిళా టెక్నీషియన్లు ఎక్కువమంది రావాలని తాను కోరుకుంటున్నట్టు తెలిపారు. అయితే చాలా కాలంగా ఆమె సినిమాలు లేవు… ఈ సినిమాలో నటించి ఉంటే బాగుండేది అని ఆమె అభిమానులు కోరుకున్నారు.