పవన్ కల్యాణ్ మాజీ భార్య సంచలన వ్యాఖ్యలు

-

పవన్ కల్యాణ్(Pawan Kalyan) మాజీ భార్య రేణు దేశాయ్(Renu Desai) మరోసారి వార్తల్లో నిలిచారు. నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే ఆమె.. తాజాగా.. ఓ వీడియోను షేర్ చేసింది. ఆ వీడియోలో ఉన్న కంటెంట్‌తో ఏడ్చేశాను అంటూ చెప్పుకొచ్చింది. ‘మా అన్న కొడుకు.. మా అన్న కొడుకు’ అంటూ ఫ్యాన్స్ చేసిన హడావుడిపై.. రేణు దేశాయ్ ఫైర్ అయింది. ‘మీ అన్న కొడుకు కాదు.. అకీరా(Akira Nandan) నా కొడుకు. మీరు ఒక తల్లికి పుట్టలేదా? ముందు ఎలా మాట్లాడాలో నేర్చుకోండి’ అంటూ మెగాభిమానులకు రేణు కౌంటర్ ఇచ్చింది.

- Advertisement -

ఇప్పుడు తాజాగా ఆమె చేసిన పోస్ట్ కూడా దాదాపు మెగా ఫ్యాన్స్‌కి మరో కౌంటర్‌లానే ఉందంటే ఆశ్చర్యపోవాల్సిన అవసరమే లేదు. రేణు దేశాయ్(Renu Desai) నిజ జీవితంలో ఎదుర్కొన్న కష్టాలను ప్రస్తావిస్తూ ఓ సామాజికవేత్త మాట్లాడిన వీడియోను షేర్ చేసిన ఆమె.. ఈ వీడియోను నాకు ఒకరు పంపారు. ఇందులో ఉన్నావిడ ఎవరో నిజంగా నాకు తెలియదు. నా గురించి ఎందుకు ఆమె మాట్లాడారో కూడా తెలియదు. కానీ తొలిసారి పబ్లిక్‌లో ఒకరు నా తరపున మాట్లాడటం విని చాలా ఏడ్చాను. నేను ఏదైనా చెబితే.. ఏదో ఒక పొలిటికల్ పార్టీకి అమ్ముడుపోయాను అంటారు. ఇప్పుడు ఎలక్షన్స్ వస్తున్నాయి అంటారు. ఈ వీడియో చూసిన తర్వాత నా బాధను అర్థం చేసుకునే వ్యక్తులు ఉన్నారనే ధైర్యం వచ్చింది అని తెలుపుతూ ఆమెకు ధన్యవాదాలు తెలుపుతూ రేణు దేశాయ్ ఎమోషనలైంది.

Read Also: భారత్‌పై కన్నెత్తి చూసే ధైర్యం కూడా ఎవరికీ లేదు: అమిత్ షా

Follow us on: Google News, Koo, Twitter

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Dandruff | ఈ చిట్కాలతో వారం రోజుల్లో చుండ్రుకు చెక్..

చుండ్రు(Dandruff) ప్రస్తుతం అనేక మందిని సతాయిస్తున్న సమస్య. దీనికి ఎన్ని రకాల...

HYDRA | ఆ భవనాలను హైడ్రా కూల్చదు: రంగనాథ్

గ్రేటర్ పరిధిలో హైడ్రా(HYDRA) చేపడుతున్న కూల్చివేతలపై తాజాగా హైడ్రా కమిషనర్ రంగనాథ్...