‘రిపబ్లిక్’ మూవీ రివ్యూ..

‘Republic’ Movie Review ..

0
82

మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ హీరోగా దేవ కట్టా దర్శకత్వంలో రూపొందించిన మూవీ ‘రిపబ్లిక్’. భారీ అంచనాల నడుమ నేడు ఈ సినిమాను రిలీజ్ చేశారు. ఈ సినిమాలో తేజ్ కు జోడిగా ఐశ్వర్యా రాజేశ్‌ జంటగా నటించగా రమ్యకృష్ణ కీలక పాత్ర చేశారు.

పంజా అభిరామ్ (సాయి ధరమ్ తేజ్) చిన్న తనం నుంచి దారి తప్పిన సిస్టమ్ కి అపోజిట్ థాట్ ప్రాసెస్ తో పెరుగుతాడు. అమెరికాకి వెళ్ళాల్సిన వాడు కొన్ని కారణాల కారణంగా కలెక్టర్ కావాలని నిర్ణయించుకుంటాడు. మరోపక్క విశాఖవాణి (రమ్యకృష్ణ) పార్టీ అధికారంలోకి వస్తోంది. ఓటు బ్యాంక్ కోసం తెల్లేరును విషపూరితంగా మారుస్తారు. దాంతో లక్ష మంది వరకూ అనేక రకాలుగా ఎన్నో ఇబ్బందులు పడుతూ ఉంటారు. ఈ క్రమంలోనే మైరా (ఐశ్వర్య రాజేష్) అన్నయ్య చనిపోతాడు. ఆ కేసుతో మొదలైన అభిరామ్ పోరాటం.. తెల్లేరు జాతకాన్ని ఎలా మార్చాడు.? ఆ తరవాత ఈ సిస్టమ్ వల్ల అతని జీవితం ఎలాంటి మలుపు తిరిగింది అనేది మిగిలిన కథ.

ప్రస్తుత రాజకీయ పరిస్థితులు, వ్య‌వ‌స్థ‌లోని లోటుపాట్ల‌ని చూపిస్తూ సినిమా తీయడంలో దర్శకుడు సఫలం అయ్యాడు. వాస్తవ సంఘటల్ని ఆధారంగా తీసుకుని దేవ కట్టా తనదైన మార్క్‌ చూపించారు. ఓ బలమైన కథని అందరికీ అర్థమయ్యేలా రూపొందించారు. సాయి ధరమ్ తేజ్ కలెక్టర్ పాత్రలో ఒదిగిపోయాడు. కోర్టు నేపథ్యంలో సాగే సన్నివేశాలు మెప్పిస్తాయి. కీలకపాత్రల్లో రమ్యకృష్ణ, జగపతి బాబు మెప్పించారు. హీరోయిన్ తన పరిధి మేరకు నటించింది.

ప్లస్ పాయింట్స్: జగపతిబాబు – సాయి తేజ్ మధ్య వచ్చే ఎమోషనల్ డ్రామా, పొలిటికల్ డైలాగ్స్, మణిశర్మ BGM

మైనస్ పాయింట్స్: ఫస్ట్ హాఫ్ లో కొన్ని కీలక సన్నివేశాల సాగతీత, సినిమా అంతా సీరియస్ గా సాగడం

పాలిటిక్స్ లవర్స్ నచ్చే సినిమా

రేటింగ్: 2.75/5

ఇటీవల రోడ్డు ప్రమాదం బారిన పడిన తేజ్‌ ఇంకా ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ కాకముందే ఈ సినిమా రిలీజ్ కావడంతో అందరి దృష్టి ఈ సినిమాపై పడింది. సాయి తేజ్ అభిమానులు ఈ సినిమా సక్సెస్ కావాలని కోటి ఆశలతో ఉండగా..ఓపెనింగ్స్ పరంగా, ఫస్ట్ టాక్ పరంగా అయితే సినిమా భేష్ అనిపించుకుందని చెప్పుకోవచ్చు.