Hema Commission Report | మలయాళ ఫిల్మ్ ఇండస్ట్రీని హేమ కమిషన్ రిపోర్ట్ కుదిపేస్తోంది. నటీమణులపై వేధింపుల వ్యవహారం బయటకి రావడంతో కేరళ సర్కార్ కమిటీని ఏర్పాటు చేసింది. ఇండస్ట్రీలో మహిళల స్థితిగతులు, లైంగిక వేధింపులకి సంబంధించి హేమ కమిషన్ నివేదికలో సంచలన విషయాలు వెలుగు చూశాయి.
ఈ క్రమంలో లైంగిక వేధింపులకు సంబంధించి హేమ కమిటీ నివేదికలో(Hema Commission Report) పేర్కొన్న వ్యక్తుల పేర్లు, వివరాలను బహిరంగంగా వెల్లడించాలని కేరళకు చెందిన ఫిల్మ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ ఫెఫ్కా డిమాండ్ చేసింది. ఈ ఆరోపణలను పరిష్కరించడానికి ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేయడాన్ని వారు స్వాగతించారు. ఫిర్యాదులను దాఖలు చేయడంలో, చట్టపరమైన చర్యలను కొనసాగించడంలో బాధితులకి సహాయం చేస్తామని హామీ ఇచ్చారు. తమ సభ్యుల ప్రమేయం ఉన్నట్లయితే, వారి హోదాతో సంబంధం లేకుండా క్రమశిక్షణా చర్యలు తీసుకోబడతాయని FEFKA పేర్కొంది. ‘అమ్మ(AMMA)’ ఎగ్జిక్యూటివ్ కమిటీ సామూహిక రాజీనామా ఇండస్ట్రీ పునరుద్ధరణకు నాంది పలుకుతుందని వారు ఆశాభావం వ్యక్తం చేశారు.