ఆర్జీవీ ‘ఆశ ఎన్​కౌంటర్’​ ట్రైలర్​ విడుదల

RGV 'Asha Encounter' Trailer Released

0
74

టాలీవుడ్‌ వివాదస్పద దర్శకుడు రాం గోపాల్‌ వర్మ గురించి ప్రత్యేకంగా చెప్పానక్కర్లేదు. వాస్తవ జీవితాల ఆధారంగా సినిమా తీయడంలో ఆర్జీవీ దిట్ట. ఎక్కడైనాకాంట్రవర్సీ కథనాలు ఉంటే.. అక్కడ్‌ రాం గోపాల్‌ వర్మ ముందుంటాడు. ఆ సినిమా లు తీసేస్తాడు వర్మ. ఇక హైదరాబాద్‌ నగర శివారులో జరిగిన దిశ హత్యాచారం అప్పట్లో ఇండియా మొత్తం సంచలనం రేకెత్తించింది.

అనంతరం నిందితులను పోలీసులు ఎన్‌ కౌంటర్‌ చేశారు. ఇక ఈ సంఘటనను ఆధారంగా చేసుకుని ఆర్జీవీ సినిమా చేశారు. దిశ ఎన్‌ కౌంటర్‌ పేరుతో ఈ సినిమా తీయగా.. దిశ తల్లిదండ్రుల అభ్యంతరం తో… ఆశ ఎన్‌కౌంటర్‌ గా టైటిల్‌ మార్చారు ఆర్జీవీ. అయితే.. ఈ సినిమా ట్రైలర్‌ తాజాగా విడుదలైంది. ఈ సినిమా ట్రైలర్‌ ను తన ట్విటర్‌ వేదికగా విడుదల చేశారు వర్మ.

https://www.youtube.com/watch?v=FpmOxA48Gbc&feature=emb_title