రామ్ గోపాల్ వర్మ సంచలనాలకు కేరాఫ్ అడ్రస్, అయితే ఆయన ఎవరిని టార్గెట్ చేసినా అది న్యూస్ అవుతుంది … ముఖ్యంగా ఇప్పుడు కమ్మరాజ్యంలో కడప రెడ్లు సినిమా చేస్తున్నారు.. ఇందులో పాత్రలు ఎవరిని అనుకుని పెట్టారో తెలిసిందే.. అయితే కొన్ని విమర్శలు కూడా ఆయనపై వైరల్ అవుతూనే ఉన్నాయి.
గతంలో రచయిత, కవి జొన్నవిత్తుల ఓమాట అన్నారు, ఆయన అన్నంత పనీ చేస్తున్నారు. ఆర్జీవీ బయోపిక్ తీయడానికి సన్నాహాలు చేసుకుంటున్నారు. అవును ఆర్జీవీలా ఉండే నటుడ్ని కూడా ఆయన సెలక్ట్ చేసుకున్నారట.
దాదాపు ఆర్జీవీ మాదిరిగానే వుండే వ్యక్తి ఒకరు మధ్యప్రదేశ్ లో వున్నట్లు తెలిసి, అతన్ని కలిసి, సినిమాకు ఒప్పించినట్లు తెలుస్తోంది.ఇక వర్మకు దేశంలో చాలా ఫేమ్ ఉంది కాబట్టి, తెలుగు తమిళ హిందీ బాషల్లో ఈ సినిమా తీస్తారు అని తెలుస్తోంది, అయితే వర్మ పై చాలా మందికి కోపం ఉంది. వారంతా కలిసి భారీ బడ్జెట్ తో సినిమాకి సాయం చేస్తారట, సో చూడాలి మరెన్ని ట్విస్టులు ఉంటాయో.