పప్పు వ్యవహారంపై ఆర్జీవీ ఫుల్ క్లారిటీ

పప్పు వ్యవహారంపై ఆర్జీవీ ఫుల్ క్లారిటీ

0
93

తెలుగు చిత్ర పరిశ్రమకు చెందిన విలక్షణ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఏం చేసిన విక్షణమే అని అంటుంటారు… ఇటీవలే ఆయన దర్శకత్వంలో తెరకెక్కిన లక్ష్మీస్ ఎన్టీఆర్ చిత్రం కూడా ఇరు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేకెత్తించిన సంగతి తెలిసిందే…

ఇప్పుడు మరో వివాద సినిమా తెరకెక్కిస్తున్నారు ఆర్జీవీ… తెలుగు ప్రేక్షకులకు దీపాలవళి కానుకగా కమ్మరాజ్యంలో కడప రెడ్లు ట్రైలర్ ను విడుదల చేశారు… ప్రస్తుతం ఈ ట్రైలర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది… తాజాగా ఓ ప్రముఖ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో చంద్రబాబు నాయుడు నారాలోకేశ్ పాత్రలపై క్లారిటీ ఇచ్చారు…

ఈ ఇంటర్వ్యూలో పప్పు వ్యవహారంపై ప్రస్తావన వచ్చింది… దీనిపై ఆర్జీవీ క్లారిటీ ఇచ్చారు… చంద్రబాబు లోకేశ్ కు పప్పు వడ్డిస్తే తప్పేంటి అన్ని అన్నారు. దీన్ని ఎందుకు అంత భూతద్దంలో చూస్తున్నారని ఆర్జీవీ అన్నారు… ఓ తండ్రి తన కుమారుడికి ప్రేమతో భోజనం వడ్డిస్తుంటే అందులో తప్పేంటి అని అన్నారు… అసలు లోకేశ్ ను పప్పు అంటారని తనకు తెలియదని అన్నారు..