మరోసారి మెగా ఫ్యామిలీ పై వర్మ పంచ్..!!

మరోసారి మెగా ఫ్యామిలీ పై వర్మ పంచ్..!!

0
89

చిరు నటిస్తున్న సైరా సినిమాపై వర్మ తనదయిన శైలిలో కామెంట్స్ చేశారు. ఎప్పుడు వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ ఉండే వర్మ ఈ సారి కూడా ఆ రేంజ్ కి తగ్గకుండా ట్విట్టర్ వేదికగా సైరా ట్రైలర్ మరియు చిత్ర నిర్మాత రామ్ చరణ్ పై ప్రశంసలు కురిపించారు.

సాధారణంగా వర్మ ప్రతి విషయంలోనూ ఎక్కడ లొసుగులు ఉన్నాయా ? అని వెతికి మరీ వాటిని పట్టుకుని కామెంట్లు చేసే వర్మ సైరా ట్రైలర్ విషయంలో పాజిటివ్‌గా స్పందించడంతో మెగా ఫ్యాన్స్ ఆనందానికి అవధులు లేవు.ఇక మెగాస్టార్ నటిస్తున్న ఈ చిత్రం అక్టోబర్ 2 న రిలీజ్ కాబోతుండగా, ఏకంగా ఐదు భాషల్లో గ్రాండ్‌గా రిలీజ్ అవడం విశేషం.

నయనతార, తమన్నా నటిస్తుండగా బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్, జగపతి బాబు, సుదీప్, విజయ్ సేతుపతి ఇతర కీలక పాత్రలలో కనిపించనున్నారు. ఈ చిత్రానికి సంగీతం అమిత్ త్రివేది అందిస్తున్నారు.