రేపు RGV ‘కొండా’ మూవీ ట్రైలర్ విడుదల

0
113

సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తెరకెక్కిస్తున్న తాజా చిత్రం ‘కొండా’. కొండా మురళి, సురేఖ జీవిత కథతో ఈ సినిమా రానుంది. ఈ సినిమాలో కొండా మురళి పాత్రలో అదిత్ అరుణ్, సురేఖపాత్రలో ఇర్రా మోర్ కనిపించనున్నారు. ఇటీవలే ఈ సినిమా షూటింగ్ పూర్తైంది.

తాజాగా ఈ సినిమా కు సంబంధించిన ఓవీడియోను రిలీజ్ చేశాడు వర్మ. కనీవినీ ఎరుగని అసాధారణ పరిస్థితుల్లో, సాధారణ వ్యక్తులు కూడా అసాధారణ శక్తులుగా మారుతారు. అలా ఒక అసాధారణ శక్తిగా మారిన సాధారణ వ్యక్తే కొండా మురళి అన్నారు ఆర్జీవీ.

నిజాలన్నీ కళ్ళకు కట్టినట్టుగా కొండా చిత్రంలో కనబడతాయన్నారు. కొండా లాంటి అసాధారణ శక్తికి ఆదిపరాశక్తి లాంటి సురేఖ తోడైనప్పుడు.. ఆశక్తులను చూసి ఓర్వలేక చుట్టూ ఉన్న రూపంలో ఉన్న కొందరు జంతువులు కొందరు చేసిన క్షుద్ర కుట్రలను తిప్పికొడుతూ.. తెలంగాణలో చేసిన ఓ కురుక్షేత్ర యుద్దమే..మా కొండా చిత్రం” అంటూ చెప్పుకొచ్చారు  వర్మ.  తాజాగా కొండా చిత్రం మొదటి ట్రైలర్‌ను రిపబ్లిక్‌ డే రోజు ఉదయం 10 గంటల 25 నిమిషాలకు విడుదల చేయనున్నట్లు తెలిపారు.