పుష్ప ట్రైలర్‌పై ఆర్జీవీ సంచలన వ్యాఖ్యలు

RGV sensational comments on floral trailer

0
115

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తున్న పుష్ప కోసం అభిమానులు, ప్రేక్షకులు ఎంతగా ఎదురుచూస్తున్నారో ప్రత్యేకంగా చెప్పాలిసిన అవసరం లేదు. ఈ సినిమానుంచి ఏచిన్న అప్ డేట్ వచ్చిన అది క్షణాల్లో వైరల్  అవుతుంది సోషల్ మీడియాలో సెన్సేషనల్ గా మారి చక్కర్లు కొడుతున్నాయి.

తాజాగా ‘పుష్ప’ ట్రైలర్ రిలీజ్ అయింది. అల్లు అర్జున్​గా హీరోగా నటించిన ఈ సినిమా.. డిసెంబరు 17న ప్రేక్షకుల ముందుకు రానుంది.  ట్రైలర్ లో బన్నీ నట విశ్వరూపం చూపించారు. మాస్ పాత్రలో ఇరగదీశాడు. ట్రైలర్ ఆసాంతం యాక్షన్ సన్నివేశాలతో నింపేశారు. ఈ లోకం నీకు తుపాకీ ఇచ్చింది.. నాకు గొడ్డలి ఇచ్చింది.. ఎవడి యుద్ధం వాడిదే అంటూ బన్నీ చెప్పిన డైలాగ్ ఆకట్టుకుంటుంది.

పుష్ప ట్రైల‌ర్‌పై సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తనదైన శైలిలో సెన్షేషనల్ కామెంట్స్ చేశారు. అల్లు అర్జున్ మాత్ర‌మే సూప‌ర్ స్టార్. ఇలాంటి రియలిస్టిక్ పాత్ర‌లో న‌టించ‌డానికి భ‌య‌ప‌డ‌లేదు. పవన్ కళ్యాణ్, మహేశ్ బాబు, చిరంజీవి, రజినీకాంత్ లాంటి వారు ఇలాంటి పాత్రలు చేయగలరా.. “పుష్ప అంటే ప్లవర్ కాదు.. ఫైర్” అని ట్రైలర్‌లో అల్లు అర్జున్ చెప్పిన డైలాగ్‌ను రాసుకొచ్చాడు వ‌ర్మ‌. ప్రస్తుతం ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.