లైగర్ రిజల్ట్..విజయ్ దేవరకొండపై ఆర్జీవీ సెన్సేషనల్ కామెంట్స్

0
125

టాలీవుడ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండ నటించిన లేటెస్ట్ మూవీ ‘లైగర్’. టాలెంటెడ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఈ సినిమాలో విజయ్ సరసన అనన్య పాండే నటించగా..రమ్యకృష్ణ, మైక్ టైసన్ కీలక పాత్రల్లో నటించారు. ఆగష్టు 25న విడుదలైన ఈ సినిమా బాక్సాఫిస్ వద్ద బొక్క బోర్లా పడింది.

ఇక ఈ సినిమా రిజల్ట్ పై వివాదాల దర్శకుడు రామ్ గోపాల్ వర్మ సెన్సేషనల్ కామెంట్స్ చేశారు. ఈ సినిమా పరాజయానికి విజయ్ దూకుడే కారణం అని, అలాగే బాలీవుడ్ లో బాయ్ కాట్ లైగర్ కు కారణం కరణ్ జోహార్ అని సంచలన వ్యాఖ్యలు ఇప్పుడు చర్చనీయాంశం అయ్యాయి.

సాధారణంగా టాలీవుడ్ హీరోలు ఎన్టీఆర్, ప్రభాస్, మహేష్ ఒద్దికగా మాట్లాడుతారు. అందుకే బాలీవుడ్ ప్రేక్షకులు అంతగా ఆదరిస్తారు. బాలీవుడ్ హీరోలందరూ అలా ఉండలేరు. కానీ లైగర్ ఈవెంట్లలో విజయ్ మాట తీరు మాత్రం సరిగా లేదు. ఇక సుశాంత్ మరణం తరువాత కరణ్ జోహార్ ను ప్రేక్షకులు బహిష్కరించడం జరుగుతుందంటూ వ్యాఖ్యానించారు.