సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆయన ఎపుడు ఎవరినీ ఏ రకంగా ఎలా గిల్లుతాడో ఆయనకే తెలియదు. సోషల్ మీడియాలో ఎప్పుడూ ఏదో ఒక విషయం పై వ్యంగ్యంగా స్పందించడం అయన అలవాటు. వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ ట్రెండింగ్‌లో నిలుస్తుంటాడు ఆర్జీవీ.
తాజాగా ఆయన మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) వివాదంపై తనదైన స్టైల్లో స్పందించాడు. మా అసోసియేషన్ లో సర్కస్ అని..రెండు రోజుల కింద ట్వీట్ చేసిన ఆర్జీవీ.. తాజాగా మరోసారి మా వివాదంపై కాంట్రవర్శియల్ కామెంట్ చేశాడు. సిని‘మా’ ఓ సర్కస్ అని, అందులో ఉండే సభ్యులంతా జోకర్లు అంటూ వర్మ సంచలన ట్వీట్ చేశారు. ప్రస్తుతం రాంగోపాల్ వర్మ చేసిన ట్వీట్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.