బాలయ్యపై వర్మ దారుణమైన ట్వీట్ మండిపడుతున్న ఫ్యాన్స్

బాలయ్యపై వర్మ దారుణమైన ట్వీట్ మండిపడుతున్న ఫ్యాన్స్

0
103

ఏపీలో రాజధాని అంశం చర్చకు వస్తోంది.. ఓ పక్క అసెంబ్లీలో రాజధాని బిల్లు నెగ్గించుకున్న వైసీపీ ఇటు మండలిలో మాత్రం నెగ్గించుకోలేకపోయింది..
నిన్న మండలిలో 3 రాజధానుల అంశంపై రభస జరుగుతున్న వేళ, లాబీల్లో కూర్చుని ఉన్న తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే, నటుడు బాలకృష్ణ, వైసీపీ ఎమ్మెల్యే రోజా ఓ సెల్ఫీ దిగారు,

ఇప్పుడు ఇది వైరల్ అవుతోంది అంతేకాదు సంచలనాను క్రియేట్ చేస్తే రామ్ గోపాల్ వర్మ దీనిపై కూడా కామెంట్ చేశాడు, ఇది ఇప్పుడు బాలయ్య అభిమానులకు తెగ కోపం తెప్పిస్తోంది, వర్మ నోటికి హద్దు అదుపు లేదా అని విమర్శలు చేస్తున్నారు..

మరి వర్మ ట్వీట్ సారాంశం చూస్తే, వావ్… రోజాగారు ఓ హీరోలా కనిపిస్తున్నారు. ఎవరో పక్కన ఉన్నారుగానీ, నాకు తెలియదు. చూసేందుకు.. యాక్… అనేలా కనిపిస్తున్నాడు. రోజా అందాన్ని తన ముఖంతో ఆయన చెడగొడుతున్నారు. బహుశా అతను రోజా దిష్టిబొమ్మేమో అని అన్నారు. ఆపై అందంగా ఉన్న రోజా పక్కన ఈ చిత్రంలో ఉన్నది ఎవరో ఎవరైనా చెప్పగరా? అని ప్రశ్నించారు. వర్మ ట్వీట్లు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. దీనిపై చాలా మంది టీడీపీ నేతలు బాలయ్య ఫ్యాన్స్ వర్మని ట్రోల్ చేస్తున్నారు.