రిషీ కపూర్ మ‌ర‌ణంతో అలియా భ‌ట్ వెంట‌నే ఏం చేసిందంటే

రిషీ కపూర్ మ‌ర‌ణంతో అలియా భ‌ట్ వెంట‌నే ఏం చేసిందంటే

0
116

రిషీ క‌పూర్ మ‌ర‌ణం భార‌త చ‌ల‌న చిత్ర ప‌రిశ్ర‌మ‌ని విషాదంలో నింపేసింది, ఆయ‌న మ‌ర‌ణించారు అని తెలియ‌గానే బీటౌన్ ఆశ్చ‌ర్య‌పోయింది.. చాలా అతి త‌క్కువ మంది మాత్ర‌మే ఆయ‌న‌ని క‌డ‌సారి చూసేందుకు వ‌స్తున్నారు , దీనికి ప్ర‌ధాన కారణం లాక్ డౌన్, ముంబైలో ఇది మ‌రింత క‌ఠినంగా అమ‌లు అవుతోంది.

రిషీ కపూర్ తనయుడు రణ్‌బీర్ కపూర్ కొన్నాళ్లుగా అందాల భామ అలియా భట్‌తో డేటింగ్‌లో ఉన్న సంగతి తెలిసిందే. త్వరలో వీరి వివాహం ఉంటుందని కూడా జోరుగా ప్రచారం జరుగుతూనే ఉంది. ఇక దీనిపై రిషీ కూడా ఏనాడు సీరియ‌స్ అవ్వ‌లేదు, అయితే అలియా రిషి మ‌ర‌ణించారు అనే వార్త తెలిసిన వెంట‌నే షాక్ అయింది.

అలియా భట్ వెంటనే తన రేంజ్ రోవర్ కారులో ముంబైలోని హెచ్ ఎన్‌రియలన్స్ ఫౌండేషన్ హాస్పిటల్‌కి చేరుకుంది. ఆసుపత్రిలో అలియా కారుకి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఆమె కూడా రిషి మ‌ర‌ణం త‌ట్టుకోలేక ఆస్ప‌త్రిలో క‌న్నీరు మున్నీరు అయింద‌ట‌, రేపు క‌పూర్ ఫ్యామిలీ మ‌ధ్య ఆయ‌న అంత్యక్రియ‌లు జ‌రుగ‌నున్నాయి అని తెలుస్తోంది.