Rk టాకీస్ బ్యానర్‌ పై ధాత్రి ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్.

-

ప్రస్తుతం సరికొత్త కథలకు డిమాండ్ పెరుగుతూ వస్తోంది. చిన్న సినిమానా లేక పెద్ద సినిమానా అనేది పక్కనబెట్టి కథకు ప్రాధాన్యం ఇస్తున్నారు నేటితరం ఆడియన్స్. నూతనంగా పరిచయం కాబోతున్న దర్శకనిర్మాతలు ప్రేక్షకుల అభిరుచులకు అనుగుణంగా సినిమాలు రూపొందిస్తున్నారు. అదే బాటలో
రవికిరణ్‌ ని హీరోగా పరిచయం చేస్తూ Rk టాకీస్ బ్యానర్‌పై ప్రొడక్షన్ నెంబర్ 2గా ధాత్రి అనే యాక్షన్ ఎంటర్టైన్మెట్ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

- Advertisement -

పలు సినిమాలకు దర్శకత్వ శాఖల్లో పనిచేసిన అనుభవమున్న డైరెక్టర్ నర్సింహా వడ్డె ఈ సినిమాకు
రచన – దర్శకత్వం వహిస్తున్నారు. పులకుర్తి కొండయ్య నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. Rk టాకీస్ బ్యానర్‌పై అన్ని హంగులతో ఈ సినిమా రూపొందిస్తున్నారు. మనీ బ్యాక్‌డ్రాప్‌లో ఆడియన్స్ థ్రిల్ అయ్యే విలక్షణ కథతో ఈ ధాత్రి సినిమా విడుదల కానుంది.

ప్రస్తుతం ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులు పూర్తి చేసుకుని,షూటింగ్ చెయ్యడానికి సన్నాహాలు జరుపుతున్నారు. తాజాగా చిత్ర టైటిల్ కన్ఫర్మ్ చేసి ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ చేశారు మేకర్స్. ఉగాది పండగ సందర్భంగా విడుదల చేసిన ఈ పోస్టర్ సినిమాపై ఆసక్తి పెంచేస్తోంది. ఈ పోస్టర్‌లో హీరో రవికిరణ్ లుక్ ను చూపిస్తూ క్యూరియాసిటీ పెంచేశారు. తలపై గాయంతో చేతిలో గన్ పట్టుకొని హీరో కనిపించాడు. ఇక ఈ పోస్టర్‌పై రిస్క్ లేనిదే ఈ మనీ ప్రపంచంలో నిలదొక్కుకోలేం అని రాసిన ట్యాగ్ లైన్ సినిమాలో నేటితరం కోరుకునే కంటెంట్ ఉందని స్పష్టం చేస్తోంది.

యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతున్న ఈ సినిమాలో ప్రతి సన్నివేశం కూడా ఉత్కంఠభరితంగా ఉంటుందని, అతి త్వరలో చిత్ర రిలీజ్ డేట్ ప్రకటిస్తామని నిర్మాత పులకుర్తి కొండయ్య తెలిపారు. ఈ కథ అందరినీ ఆకట్టుకుంటూ గొప్ప విజయం సాధిస్తుందనే నమ్మకం ఉందని ఆయన పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Dandruff | ఈ చిట్కాలతో వారం రోజుల్లో చుండ్రుకు చెక్..

చుండ్రు(Dandruff) ప్రస్తుతం అనేక మందిని సతాయిస్తున్న సమస్య. దీనికి ఎన్ని రకాల...

HYDRA | ఆ భవనాలను హైడ్రా కూల్చదు: రంగనాథ్

గ్రేటర్ పరిధిలో హైడ్రా(HYDRA) చేపడుతున్న కూల్చివేతలపై తాజాగా హైడ్రా కమిషనర్ రంగనాథ్...