బ్రేకింగ్ – ప్రముఖ కమెడియన్ కన్నుమూత

బ్రేకింగ్ - ప్రముఖ కమెడియన్ కన్నుమూత

0
92

ఈ ఏడాది సినీ ఇండీస్ట్రీలో చోటుచేసుకుంటున్న వరుస విషాదాలు యావత్ సినీ లోకాన్ని కలవరపెడుతున్నాయి. టాలీవుడ్ అగ్ర కమెడియన్ జయప్రకాశ్ రెడ్డి ఇటీవ‌ల మరణించారు, మొన్న కోసూరి వేణుగోపాల్ కరోనాతో మరణించారు,ఈ స‌మ‌యంలో మ‌రో క‌మెడియ‌న్ ఈ లోకాన్ని విడిచి వెళ్లారు.

ప్రముఖ కన్నడ నటుడు రాక్‌లైన్ సుధాకర్ గురువారం గుండెపోటుతో కన్నుమూశారు.
ఓ సినిమా షూటింగ్‌లో ఉండగా గుండెపోటు రావడంతో వెంటనే ఆసుపత్రికి తరలించే ప్రయత్నం చేశారు. ఇంతలో మార్గం మధ్యలోనే ఆయన కన్నుమూసినట్లు కన్నడ సినీ వర్గాలు పేర్కొన్నాయి. ఆయ‌న‌కు ఇటీవ‌ల కరోనా సోకింది.. ఆస్ప‌త్రిలో చికిత్స పొంది కోలుకున్నారు, కాని ఆయ‌న‌కు గుండెపోటు రావ‌డంతో క‌న్నుమూశారు.

ఆయ‌న క‌న్న‌డ చిత్ర సీమ‌లో 120కి పైగా చిత్రాల్లో నటించారు. ఆయ‌న మ‌ర‌ణంతో కన్నడ సినీ ఇండస్ట్రీ పెద్దలు ఆయనకు సంతాపం ప్రకటించారు. రాక్ లైన్ సుధాకర్ అజిత్, ఉడుంబా, తోపివాలా, జూమ్, చమక్, బాణసంచాతో చిత్రాల్లో నటించారు. 1992 లో బెల్లి మోడగలు అనే చిత్రంతో తొలిసారిగా పరిశ్రమలో అడుగుపెట్టారు. ఆయ‌న ముందు రాక్‌లైన్ ప్రొడక్షన్స్ లో ప్రొడక్షన్ మేనేజర్ గా పనిచేశారు. దాంతో పనిచేసిన సంస్థనే ఇంటిపేరుగా మార్చుకున్నారు.