తెలుగు బిగ్ బాస్ సీజన్ 4 విన్నర్ అభిజిత్ కి ప్రశంసలు వస్తున్నాయి.. ముఖ్యంగా టాలీవుడ్ సినిమా పరిశ్రమ నుంచి అభిజిత్ ని అందరూ విష్ చేశారు, ముఖ్యంగా ఇప్పుడు సినిమా కథలు వింటూ ఫుల్ బిజీగా ఉన్నాడు అభిజిత్, అంతేకాదు పలు ఇంటర్వ్యూలతో బిజీగా ఉన్నాడు.
అయితే తాజాగా అభిజిత్ కు టీమిండియా స్టార్ బ్యాట్స్ మెన్ రోహిత్ శర్మ సర్ ప్రైజ్ ఇచ్చాడు. బిగ్ బాస్ లో గెలిచినందుకు రోహిత్ స్వయంగా ఫోన్ చేసి అభినందించాడు. దీంతో అభి ఎంతో ఆనందించాడు, అంతేకాదు తన జెర్సీపై విత్ లవ్ అండ్ బెస్ట్ విషెస్అని రాసి తన సంతకం చేసి అభిజిత్ కు పంపించాడు.
అభిజిత్ కు రోహిత్ అంటే చాలా ఇష్టం, అందుకే ఆయన మ్యాచ్ లు జరిగే సమయంలో రోహిత్ బ్యాటింగ్ చేస్తుంటే తన పని ఆపేసి మరీ రోహిత్ బ్యాటింగ్ చూస్తారట. ఇక తాజాగా రోహిత్ పంపిన గిఫ్ట్ విషెస్ గురించి అభిజిత్ తెలిపాడు.