ప్రముఖ దర్శకుడు కొరటాల శివ(Koratal Siva) దర్శకత్వంలో, యంగ్ టైగర్ ఎన్టీఆర్(NTR) ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న సినిమా దేవర. ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ కార్యక్రమాలు శరవేగంగా కొనసాగుతున్నాయి. ఇటీవల విడుదలైన దేవర పోస్టర్ సినిమాపై అభిమానుల్లో అంచనాలను పెంచేసింది. అప్పటినుండి సినిమా ఎప్పుడు విడుదల అవుతుందా అని ఫ్యాన్స్ తెగ ఎదురు చూస్తున్నారు. మరోవైపు ఈ సినిమాలో అలనాటి అందాల తార శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్(Janvi Kapoor) కూడా నటిస్తుండటంతో దేవర పై మరింత ఆసక్తి నెలకొంది. ఆమె పాత్ర ఎలా ఉండబోతోంది అనే విషయం చర్చనీయాంశంగా మారింది. నెట్టింట జాన్వీ పాత్రపై పలు ఊహాగానాలు చక్కర్లు కొడుతున్నాయి. ఈ నేపథ్యంలో మరో ఆసక్తికర విషయం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఈ సినిమాలో విలన్ గా నటిస్తోన్న సైఫ్ అలీఖాన్ కు సవతి కూతురిగా జాన్వీ ఉందనుందట. మూవీలో ఆమె ఓ మత్స్యకారురాలిగా నటించి ఎన్టీఆర్ ని ట్రాప్ ట్రాప్ చేస్తుందని సినీవర్గాలు చెబుతున్నాయి. అయితే జాన్వీ(Janvi Kapoor) పాత్ర ఇలానే ఉంటుందా లేదా తెలియాలంటే సినిమా రిలీజ్ అయ్యేవరకు వెయిట్ చేయక తప్పదు.
ఎన్టీఆర్ ‘దేవర’ మూవీలో జాన్వీ కపూర్ పాత్ర ఇదే?
-
- Advertisement -