మొత్తానికి జక్కన్న తీస్తున్న ఆర్ ఆర్ ఆర్ సినిమా విడుదల ఎప్పుడా అని అందరూ ఎదురుచూశారు.. ఎప్పుడు ఈ సినిమా రిలీజ్ ప్రకటన వస్తుందా అని చూశారు ఇటు అభిమానులు.. మొత్తానికి ఈ సినిమా ప్రకటన వచ్చేసింది… అయితే అక్టోబర్ 13న ప్రపంచ వ్యాప్తంగా ఈ చిత్రాన్ని గ్రాండ్ రిలీజ్ చేయనున్నట్టు చిత్ర నిర్మాతలు అధికారికంగా ప్రకటించారు.
ఇక ఈ డేట్ గురించి ఇప్పుడు బాలీవుడ్ లో కూడా రచ్చ జరుగుతోందట, ముఖ్యంగా ఈ సినిమా విడుదల అవుతుంది అంటే కచ్చితంగా ఓ పది రోజులు ఏ సినిమా బరిలోకి వచ్చే ఛాన్స్ ఉండదు.. ఎందుకు అంటే రాజమౌళి సినిమాలు ఆరేంజ్ లో కలెక్షన్లు కురిపిస్తాయి బాహుబలి కూడా అలాగే వచ్చింది.
అయితే తాజాగా నిర్మాత బోనీకపూర్ కాస్త దీనిగురించి స్పందించారని తెలుస్తోంది, అన్యాయం అంటున్నారు, ఎందుకు అంటే ఆయన నిర్మాతగా అజయ్ దేవగణ్ హీరోగా మైదాన్ చిత్రాన్ని అక్టోబర్ 15న రిలీజ్ చేస్తున్నట్టు ఆరు నెలల క్రితమే ప్రకటించారు, అయితే ఇప్పుడు ఇదే సమయంలో ఆర్ ఆర్ ఆర్ రిలీజ్ ఎలా చేస్తారు అని అంటున్నారు ఆయన… సో దీనిపై ఆర్ ఆర్ ఆర్ చిత్ర యూనిట్ ఎలా స్పందిస్తుందో చూడాలి.