RRR హీరోయిన్ గా లండన్ నటి ఎందుకో తెలుసా

RRR హీరోయిన్ గా లండన్ నటి ఎందుకో తెలుసా )

0
122

దర్శకధీరుడు రాజమౌళి జూనియర్ ఎన్టీఆర్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న చిత్రం RRR ఈ సినిమాని ప్రముఖ నిర్మాత దానయ్య నిర్మిస్తున్నారు. ఇక ఇప్పటికే సినిమా ప్రధాన చిత్రీకరణ పూర్తి అయింది. సుమారు 75 శాతం సినిమా షూటింగ్ పూర్తి అయింది.

ఈ సినిమాలో రామ్ చరణ్ సరసన బాలీవుడ్ భామ ఆలియా భట్ నటిస్తుండగా.. తారక్కు జంటగా నటించే హీరోయిన్ ఒలీవియా మోరిస్ అనే నటిని ఎన్టీఆర్ సరసన నటించే జెన్నీఫర్గా పరిచయం చేస్తూ చిత్ర యూనిట్ ఇటీవల ట్విట్టర్ ద్వారా పరిచయం చేసింది.

ఒలీవియా మోరిస్ లండన్కు చెందిన థియేటర్ ఆర్టిస్ట్. అంతేకాదు, కొన్ని టీవీ సిరీస్లలో కూడా నటించింది. హర్రర్ చిత్రంలో కూడా నటించింది, వాటిని రాజమౌళి చూశారట. అందుకే ఆమెని హైదరాబాద్ తీసుకువచ్చి వారం రోజులు ఆమెకు స్క్రీన్ టెస్ట్ చేశారట రాజమౌళి…అయితే లండన్ నటిని తీసుకోవడానికి కారణం కూడా ఉంది అని చెబుతున్నారు చిత్ర యూనిట్. కొమరం భీం అప్పట్లో బ్రిటిష్ యువరాణిని ప్రేమిస్తాడు, అప్పుడు బ్రిటిషర్స్ ఊరుకోరు, ఆమెని మళ్లీ లండన్ పంపిస్తారు. అందుకే ఈమెని రాజమౌళి సెలక్ట్ చేశారట, ఆ నేటివిటి ఉండాలి అని ఈ పాత్ర కోసం లండన్ నటిని తీసుకోవాలి అని ముందే భావించారట. లేకపోతే బాలీవుడ్ హీరోయిన్ ని తీసుకునే వారని చెబుతున్నారు. ఇక ఆమెకు సుమారు 25 కోట్ల రూపాయల వరకూ రెమ్యునరేషన్ ఇవ్వనున్నారని తెలుస్తోంది.