ఆర్ఆర్ఆర్ సినిమాకి చిరంజీవి సాయం ఏం చేస్తున్నారంటే

ఆర్ఆర్ఆర్ సినిమాకి చిరంజీవి సాయం ఏం చేస్తున్నారంటే

0
119

ఆర్ఆర్ఆర్ సినిమాపై ఎన్నో ఆశలు పెట్టుకున్నారు చిత్ర యూనిట్ , మరీ ముఖ్యంగా ఈసారి ఈసినిమాని అనుకున్న సమయానికి పూర్తి చేయాలి అని జక్కన్న ప్లాన్ చేస్తున్నారు.. ఓ పక్క షూటింగ్ మరో పక్క ఎడిటింగ్ రెండూ వేగంగా చేస్తున్నారట,ఎన్టీఆర్, రామ్ చరణ్ కు సంబంధించి కీలకమైన పోరాట సన్నివేశాలు 70 శాతం వరకూ షూటింగ్ పూర్తి అయింది.

ఈ సమయంలో ఈ సినిమాకు సంబంధించిన ఒక ఆసక్తికర వార్త ఫిలింనగర్ లో చక్కర్లు కొడుతోంది. ఈ సినిమాలో చిరంజీవి కూడా భాగం కానున్నారట, అయితే ఆచార్య సినిమాలో బిజీగా ఉన్న చిరు ఇందులో నటిస్తారా అని మీకు అనుమానం వచ్చి ఉండవచ్చు, అయితే ఇందులో ఎలా భాగం కానున్నారు అంటే.

ఈ సినిమాలో తారక్, రాంచరణ్ పాత్రలను పరిచయం చేస్తూ చిరంజీవి వాయిస్ ఓవర్ ఇవ్వనున్నారట. దీనిపై రాజమౌళి ఆయనని అడిగారు అని తెలుస్తోంది.. ఆయన కూడా ఒకే చెప్పారట, ఇది సినిమాకు మంచి అసెట్ అవుతుంది అనే చెప్పాలి.
హిందీ వర్షన్ లో బాలీవుడ్ నటుడు ఆమిర్ ఖాన్ వాయిస్ ఓవర్ ఇవ్వనున్నారట.