‘RRR’..ఈ 4 పాత్రలు ఎలా ఉండబోతున్నాయి? అవేంటంటే..

0
114

రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన పాన్ ఇండియా చిత్రం ఆర్ఆర్ఆర్. ఈ సినిమాలో అల్లూరి సీతారామరాజు పాత్రలో రామ్ చరణ్.. కొమురం భీమ్ పాత్రలో ఎన్టీఆర్ కనిపించనున్నాడు. ఈ సినిమా కోసం తెలుగు రాష్ట్రాల్లో అభిమానులు నాలుగు ఏళ్ల నుంచి ఎదురు చూస్తున్నారు. కరోనా కారణంగా వాయిదా పడుతూ వచ్చిన ట్రిపుల్ ఆర్ నేడు ప్రపంచ వ్యాప్తంగా విడుదల కాబోతోంది.

అయితే ఈ సినిమాలో నాలుగు పాత్రలు మాత్రం అద్భుతంగా వుండబోతున్నాయని తెలుస్తుంది. ఆ నాలుగు పాత్రలు సినిమాలో ముఖ్య పాత్రలు పోషించనున్నాయి. వాటిలో అజయ్ దేవగన్, రాజీవ్, సముద్రఖని, శ్రియ పాత్రలుగా తెలుస్తుంది.

అజయ్​దేవగణ్​: బాలీవుడ్‌ నటుడు అజయ్‌దేవ్‌గణ్‌ నేరుగా నటించిన తొలి తెలుగు సినిమా ఇదే. ఇందులో ఆయన ఓ పోరాట యోధుడిగా కనిపించనున్నారు. ఈ సినిమాలో ఆయన కనిపించేంది కొంతసేపే అయినప్పటికీ.. అది ప్రేక్షకులపై ఎంతో ప్రభావం చూపుతుందని చిత్రబృందం చెప్పింది. ఈ సినిమా కోసం ఆయన పారితోషికం కూడా తీసుకోలేదని తెలిసింది.

రాజీవ్‌ కనకాల: జక్కన్న తెరకెక్కించిన చాలా సినిమాల్లో రాజీవ్​ కనకాల నటించారు. ‘స్టూడెంట్‌ నం:1’, ‘సై’, ‘విక్రమార్కుడు’ చిత్రాల్లో ఆయన కీలక పాత్రలు పోషించారు. ఇందులో భీమ్‌ పాత్ర గొప్పతనం గురించి బ్రిటీష్‌ వాళ్లకు రాజీవ్‌ వివరించే సన్నివేశాలు రోమాలు నిక్కబొడుచుకునేలా ఉంటాయని తెలుస్తోంది.

సముద్రఖని: ఈ సినిమాలో కీలకపాత్ర పోషించిన వారిలో కోలీవుడ్‌ నటుడు, దర్శకుడు సముద్రఖని ఒకరు. ఇందులో ఆయన పోలీస్‌ కానిస్టేబుల్‌ రోల్‌లో రామ్‌చరణ్‌కు అత్యంత సన్నిహితుడిగా కనిపించనున్నారు. బ్రిటీష్‌ వారిపై యుద్ధం చేయడానికి రామ్‌చరణ్‌ సిద్ధమవుతుండగా.. “చాలా ప్రమాదం ప్రాణాలు పోతాయ్‌ రా” అంటూ ఆయన భావోద్వేగంతో చెప్పే సంభాషణలు ప్రేక్షకులను కట్టిపడేశాయ్​. టాలీవుడ్‌ నటుడు రాహుల్ రామకృష్ణ సైతం ఈసినిమాలో కీలకపాత్ర పోషించారు. ఇందులో ఆయన తారక్‌ వెంట ఉండే వ్యక్తిగా కనిపించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

శ్రియ: ఇందులో అజయ్‌దేవ్‌గణ్‌ భార్య సరోజిని పాత్రలో నటి శ్రియ నటించారు. బరువైన గుండెతో కుటుంబాన్ని వదిలి.. భర్త అడుగుజాడల్లో పోరాట మైదానంలోకి అడుగుపెట్టిన స్త్రీగా ఆమె కనిపించనున్నారు. శ్రియ పాత్ర ఎంతో భావోద్వేగాలతో రూపుదిద్దుకుందని ట్రైలర్​ చూస్తుంటే తెలుస్తోంది. అంతకుముందు ఆమె రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ‘ఛత్రపతి’ సినిమాలో నటించింది.