ఆర్ ఆర్ ఆర్ కూడా ఆయనకే ఇస్తారా పెద్ద డీల్

ఆర్ ఆర్ ఆర్ కూడా ఆయనకే ఇస్తారా పెద్ద డీల్

0
105

బాహుబలి సినిమా చాలా మందికిి స్టార్ డమ్ తీసుకువచ్చింది.. అలాగే సినిమాకి విపరీతమైన లాభాలు తెచ్చిపెట్టింది.. ముఖ్యంగా నిర్మాత శోభు యార్లగడ్డ కంటే కూడా అధికంగా ఫలితం పొందిన వ్యక్తి ఉన్నారు ఆయనే బాలీవుడ్ కింగ్ దర్శక నిర్మాత కరణ్ జోహార్. ఇక రాజమౌళికి బెస్ట్ ఫ్రెండ్ కూడా అయ్యారు.

బాహుబలి హిందీ వర్షన్స్ ని కరణ్ తన ధర్మ ప్రొడక్షన్స్ కంపెనీ ద్వారా డిస్ట్రిబ్యూట్ చేశారు. దీనితో ఆయన బాహుబలి వలన ఊహించని లాభాలు వచ్చాయి. మరి తాజాగా ఆయన సన్నిహితుడు జక్కన్న ఆర్ ఆర్ ఆర్ సినిమా చేస్తున్నారు .. మరి ఈ సినిమా కూడా బాలీవుడ్ లో రిలీజ్ కానుంది. ఈ సమయంలో ఆర్ ఆర్ ఆర్ హిందీ విడుదల హక్కులు కూడా కరణ్ కు వస్తాయి అనే టాక్ నడుస్తోంది.

అయితే దీనికి ఈసారి పెద్ద సంస్దలు కూడా పోటీకి వస్తున్నాయి అని తెలుస్తోంది, మరి బాహుబలికి ఉత్తరభారతంలో అంత క్రేజ్ తీసుకువచ్చింది కరణ్.. కాబట్టి సినిమాపై హైప్ ప్రమోషన్ ఆయన బాగా చేస్తారని. ఆయనకే చిత్ర విడుదల హక్కులు బాలీవుడ్ లో ఇచ్చే అవకాశం ఉంది అని టాక్ నడుస్తోంది.
ఆర్ ఆర్ ఆర్ చిత్రం థియేటర్ల సమస్య వంటివి కూడా అక్కడ రాకుండా కరణ్ చేయగలరు అని అంటున్నారు బీటౌన్ మేధావులు.. ఈ మల్టీ స్టారర్ వచ్చే ఏడాది జులై 30న విడుదల కానుంది