రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన పాన్ ఇండియా చిత్రం ‘RRR’. ఈ సినిమాలో అల్లూరి సీతారామరాజు పాత్రలో రామ్ చరణ్.. కొమురం భీమ్ పాత్రలో ఎన్టీఆర్ కనిపించారు. కరోనా కారణంగా వాయిదా పడుతూ వచ్చిన ట్రిపుల్ ఆర్ నిన్న ప్రపంచ వ్యాప్తంగా విడుదల అయింది. తొలి షో నుంచే పాజిటివ్ టాక్ తెచ్చుకోవడంతో సినిమా కలెక్షన్లలో దుమ్ములేపుతుంది.
ట్రేడ్ అనలిస్ట్ తరుణ్ ఆదర్శ్ ప్రకారం ట్రిపుల్ ఆర్ సినిమా తొలిరోజు ప్రపంచవ్యాప్తంగా రూ. 223 కోట్లు వసూలు చేసిందని వెల్లడించారు. ట్రిపుల్ ఆర్ మొదటి రోజు కలెక్షన్లలో బాహుబలి-2 ని అధిగమించింది. ఇప్పుడు ట్రిపుల్ ఆర్ ఇండియన్ సినిమాల్లో నంబర్ 1 ఓపెనర్ అని ఆయన అన్నారు.
ఏపీలో రూ. 75 కోట్లు, నైజాం రూ. 27.5 కోట్లు, కర్ణాటక రూ. 14.5 కోట్లు, తమిళనాడు రూ. 10 కోట్లు, కేరళ రూ. 4 కోట్లు, నార్త్ ఇండియా రూ. 25 కోట్లు, మొత్తంగా భారతదేశంలో రూ. 156 కోట్లు, యూఎస్ఏలో రూ. 42 కోట్లు, నాన్ – యూఎస్ రూ. 25 కోట్లు మొత్తంగా రూ. 223 కోట్లు వసూలు చేసిందని.. అంతకుముందు బాహుబలి2 ప్రపంచవ్యాప్తంగా రూ. 217 కోట్లు వసూలు చేసిందని వెల్లడించారు.