రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన పాన్ ఇండియా చిత్రం ఆర్ఆర్ఆర్. ఈ సినిమాలో అల్లూరి సీతారామరాజు పాత్రలో రామ్ చరణ్.. కొమురం భీమ్ పాత్రలో ఎన్టీఆర్ కనిపించనున్నాడు. ఈ సినిమా కోసం తెలుగు రాష్ట్రాల్లో అభిమానులు నాలుగు ఏళ్ల నుంచి ఎదురు చూస్తున్నారు. కరోనా కారణంగా వాయిదా పడుతూ వచ్చిన ట్రిపుల్ ఆర్ మార్చి 25 న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కాబోతోంది.
బాహుబలి తరువాత రాజమౌళి దర్శకత్వంతో వస్తున్న భారీ మల్టీ స్టారర్ సినిమా కావడంతో అందరిలోనూ భారీగా అంచనాలు ఉన్నాయి. ఇదిలా ఉంటే విడుదలకు ముందే RRR రికార్డ్ లు బ్రేక్ చేస్తోంది. ఇప్పటికే నైజాం అడ్వాన్స్ బుకింగ్స్ లో టాప్ గా ఉన్న ‘ భీమ్లానాయక్’ సినిమాను ట్రిపుల్ ఆర్ క్రాస్ చేసింది. భీమ్లా నాయక్ మించి అడ్వాన్స్ బుకింగ్స్ నమోదయ్యాయి.
తాజాగా మరో రికార్డ్ ను కూడా ట్రిపుల్ ఆర్ బ్రేక్ చేసింది. ఏకంగా భారతీయ చిత్రాల రికార్డ్ ను బద్దలు కొట్టింది. అమెరికా ప్రీమియర్ ప్రీ సేల్ లో ట్రిపుల్ ఆర్ …2.5 మిలియన్ డాలర్ల మార్క్ ను దాటేసి 3 మిలియన్ డాలర్ల వైపు దూసుకెళ్తోంది. దీంతో బాహుబలి-2 ( 2.4 మిలియన్ డాలర్లు) రికార్డ్ బ్రేక్ అయింది. ఈ రోజు ( మార్చ్ 24) అమెరికాలో ట్రిపుల్ ఆర్ ప్రిమియర్ షోలు వేయనున్నారు. మరోవైపు తెలుగు రాష్ట్రాల్లో వీకెండ్ వరకు అన్ని బుకింగ్స్ పూర్తయ్యాయి.