‘RRR’ మూవీ సెన్సార్ పూర్తి..ర‌న్ టైం ఎంతంటే?

0
92

రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన పాన్ ఇండియా చిత్రం ఆర్ఆర్ఆర్. ఈ సినిమాలో అల్లూరి సీతారామరాజు పాత్రలో రామ్ చరణ్.. కొమురం భీమ్ పాత్రలో ఎన్టీఆర్ కనిపించనున్నాడు. ఈ సినిమా కోసం తెలుగు రాష్ట్రాల్లో అభిమానులు నాలుగు ఏళ్ల నుంచి ఎదురు చూస్తున్నారు.

అయితే ఇప్పటికే ఈ సినిమా విడుదల కావాల్సి ఉండగా.. కరోనా కేసులు పెరగడంతో సినిమాను వాయిదా వేశారు మేకర్స్.ఇది ఇలా ఉండగా ఈ నెల 25వ తేదీన విడుద‌ల కాబోతున్నట్టు తెలిపారు చిత్ర యూనిట్. ఈ సినిమా పై భారీ అంచనాలు నెలకొన్నాయి.

కాగ ఈ సినిమా గురించి తాజా అప్ డేట్ వ‌చ్చింది. ఈ సినిమా కు సెన్స‌ర్ U/A సెర్టిఫికేట్ అందించింది. కాగ ఈ సినిమా ర‌న్ టైం ర‌న్ టైం 3 గంట‌ల 6 నిమిషాలు ఉంటుంది. దీనికి సంబంధించిన సెన్స‌ర్ సెర్టిఫికెట్ కూడా సోషల్ మీడియాలో చెక్క‌ర్లు కొడుతుంది.