‘RRR’ మూవీ..‘కొమ్మా ఉయ్యాల’ ఒరిజినల్ సింగర్ ఎవరో తెలుసా?

0
114

రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన పాన్ ఇండియా చిత్రం ‘RRR’. ఈ సినిమాలో అల్లూరి సీతారామరాజు పాత్రలో రామ్ చరణ్.. కొమురం భీమ్ పాత్రలో ఎన్టీఆర్ కనిపించారు. ఈ సినిమా కేవలం టాలీవుడ్ లోనే కాదు బాలీవుడ్ లో కూడా రికార్డ్స్ క్రియేట్ చేస్తోంది.

ఇదిలా ఉంటే ఈ సినిమా ప్రారంభంలో వచ్చే ‘కొమ్మ ఉయ్యాల’ అనే పాటకు ప్రేక్షకులు ఫిదా అయ్యారు. సినీ ప్రియులను ఆకట్టుకున్న ఆ పాట పాడిన బాలగాయని ప్రకృతి రెడ్డి. ఆ లిరికల్ సాంగ్ వీడియోను విడుదల చేయాలని ప్రేక్షకుల కోరుతున్నారు.

పన్నెండేళ్ల వయసున్న ప్రకృతి రెడ్డికి చిన్నతనం నుండి పాటలు అంటే చాలా ఇష్టం. తను కన్నడలో పుటిన.. తెలుగు, తమిళం, హిందీలో కూడా పాటలు అద్భుతంగా పాడుతుంది. ప్రేక్షకులను ఎంతో ఆకట్టుకున్న ఈ చిన్నారి బుల్లితెరపై వచ్చే పలు షోల్లో కూడా పాల్గొంది.