‘RRR’ సినిమా E.P.I.C..మహేష్ బాబు సూపర్ ట్వీట్

0
125

రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన పాన్ ఇండియా చిత్రం ఆర్ఆర్ఆర్. ఈ సినిమాలో అల్లూరి సీతారామరాజు పాత్రలో రామ్ చరణ్.. కొమురం భీమ్ పాత్రలో ఎన్టీఆర్ కనిపించనున్నారు. ఈ సినిమా కోసం తెలుగు రాష్ట్రాల్లో అభిమానులు ఎంతో ఎదురుచూసారు. తుదకు ఈసినిమా విడుదలై అభిమానుల నుండి సూపర్ రెస్పాన్స్ దక్కిచుకుంది.

‘ఆర్ఆర్ఆర్’ సినిమాకు అన్ని వర్గాల ప్రజల నుంచి సూపర్ రెస్పాన్స్ వస్తోంది. విడుదలైన అన్ని సెంటర్లలో పాజిటివ్ టాక్ తో దూసుకుపోతోంది. రాజమౌళి దర్శకత్వం, ఎన్టీఆర్, రామ్ చరణ్ యాక్టింగ్ పై ప్రశంసలు కురుస్తున్నాయి. దాదాపు 5 ఏళ్ల తరువాత బాహుబలి సూపర్ హిట్ తరువాత వస్తున్న సినిమా కావడంతో ట్రిపుల్ ఆర్ పై భారీగా హైప్ క్రియేట్ అయింది. ముఖ్యంగా విజువల్ ఎఫెక్ట్… ఇద్దరు స్టార్ల యాక్టింగ్, ఇంటర్వెల్, క్లైమాక్స్ సీక్వెన్స్ ప్రేక్షకులను కట్టిపడేస్తున్నాయి. దీంతో సినీ ప్రముఖులను నుంచి ట్రిపుల్ ఆర్ టీం కు ప్రశంసలు దక్కుతున్నాయి. మెగాస్టార్ చిరంజీవి, డైరెక్టర్ శంకర్ వంటి వారు సినిమాను పొగిడారు. బాలీవుడ్, టాలీవుడ్ అన్న తేడా లేకుండా పలువురు సినీ ప్రముఖులు ట్రిపుల్ ఆర్ పై ప్రశంసలు కురిపిస్తున్నారు.

తాజాగా సూపర్ స్టార్ మహేష్ బాబు ట్రిపుల్ ఆర్ పై సూపర్ ట్విట్ చేశారు. RRR సినిమా E.P.I.C  అంటూ ప్రశంసలు కురిపించారు. ‘గ్రాండ్ విజువల్స్, మ్యూజిక్, ఎమోషన్స్ అద్భుతంగా ఉన్నాయని.. కేవలం మాస్టర్ స్టోరీ టెల్లర్ మాత్రమే ఇది చేయగలడు. సెన్సెషన్ ఫిల్మ్ మేకింగ్ లో రాజమౌళి మాస్టర్. తారక్, చెర్రీ స్టార్ డమ్ ను మించి గొప్పగా ఎదుగుతున్నారు.  నాటు నాటు పాటలో గురుత్వాకర్షణ సిద్ధాంతం పనిచేయలేదు. నిజానికి వారు గాల్లో ఎగిరారు. ట్రిపుల్ ఆర్ టీంకు అభినందనలు’ అంటూ ట్విట్ చేశారు.