RRR Movie: పులితో ఎన్టీఆర్ ఫైట్​ సీన్​ మేకింగ్ వీడియో చూశారా?

0
121

దర్శకధీరుడు రాజమౌళి రూపొందించిన పాన్​ ఇండియా చిత్రం RRR. భారీ బడ్జెట్‌తో రూపుదిద్దుకున్న ఈ సినిమాలో ఎన్టీఆర్, రామ్ చరణ్ అద్భుత నటన కనబరిచారు. అలియా భట్, అజయ్ దేవ్ గన్ ఈ సినిమాలో కీలక పాత్రలో నటించారు. ఇక ఇందులో ఎన్టీఆర్ ఎంట్రీ సీన్ ఎంతగా ఆకట్టుకుందో తెలిసిన విషయమే.

పెద్దపులితో భీకర పోరాటం చేస్తూ ఎన్టీఆర్‌ ఎంట్రీ సినిమాకు హైలైట్. కాగా, ఈ సీన్‌ని ఎలా చిత్రీకరించారో తెలియజేస్తూ ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ టీమ్‌ తాజాగా మేకింగ్‌ వీడియో షేర్‌ చేసింది. నిమిషం నిడివి గల ఈ వీడియోలో మొదట సినిమా సీన్‌ని చూపించి..తర్వాత దాన్ని ఎలా తీర్చిదిద్దారో తెలియజేశారు.

https://www.youtube.com/watch?v=14azxwigO68&feature=emb_title

తారక్‌పై దాడి చేసేందుకు పులి ఎలా ముందుకు ఉరుకుతుంది? పంజా విసిరేందుకు ఏవిధంగా ప్రయత్నిస్తుంది? ఇలా ప్రతి విషయాన్ని జక్కన్న క్షుణ్ణంగా తెలియజేస్తూ కనిపించారు. ప్రస్తుతం వీడియో మూవీ లవర్స్‌ని బాగా ఆకర్షిస్తోంది.