#RRR సినిమా లో హీరోయిన్ ల పేర్లు చెప్పేసిన రాజమౌళి

#RRR సినిమా లో హీరోయిన్ ల పేర్లు చెప్పేసిన రాజమౌళి

0
126

దర్శకుడు రాజమౌళి బాహుబలి తరువాత తెరకెక్కిస్తున్నచిత్రం #RRR ప్రస్తుతం ఈ సినిమా సెకండ్ షెడ్యూల్ చిత్రీకరణ జరుపుకుంటోంది. ఈ షెడ్యూల్ లో లీడ్ యాక్టర్లపై రాజమౌళి కీలకమైన సన్నివేశాలను తెరకెక్కిస్తున్నారట. మొదటి షెడ్యూల్ అయిపోయింది. రెండో షెడ్యూల్ కూడా మూడో వారంలోకి అడుగుపెట్టింది కానీ రాజమౌళి టీమ్ ఇంతవరకూ ఈ సినిమా హీరోయిన్లను ఫైనలైజ్ చేయకపోవడం అందరికీ ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది.

అయితే తాజాగా ఈ సినిమా ప్రెస్ మీట్ జరిగింది.ఈ ప్రెస్ మీట్ లో రాజమౌళి ఈ సినిమా లో చరణ్ కి జోడిగా అలియా భట్ నటిస్తుంది అని చెప్పుకొచ్చాడు.అంతే కాకుండా ఎన్టీఆర్ కి జోడిగా హాలీవుడ్ హీరోయిన్ డైసీ ఎడ్జెర్ జోన్స్ నటిస్తుంది అని చెప్పుకొచ్చాడు.ముఖ్యం గా ఈ సినిమా లో రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజు గా ఎన్టీఆర్ కొమరం భీమ్ గా నటిస్తున్నాడు అని రామ్ కాహారం చెప్పుకొచ్చాడు.ఈ సినిమాలో అజయ్ దేవగన్ కూడా ఒక రోల్ చేస్తున్నట్లు రాజమౌళి రివీల్ చేశారు.