RRR లో ఆ ఫైట్ కోసం 2000 జూనియర్స్..!!

RRR లో ఆ ఫైట్ కోసం 2000 జూనియర్స్..!!

0
118

ప్రస్తుతం రాజమౌళి ఎన్టీఆర్, రాంచరణ్ ల మల్టీస్టారర్ మూవీ ‘ఆర్ఆర్ఆర్’తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాలో ఎన్టీఆర్ తెలంగాణ మన్యం పోరాట యోధుడు కొమురంభీమ్ గా, రాంచరణ్ ఆంధ్ర మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజుగా కనిపించబోతున్నట్లు ఇటీవల ఓ ప్రెస్ మీట్ లో చెప్పారు. అయితే ఈ ఇద్దరు హీరోలకు గాయం కారణంగా షూటింగ్ కొంత విరామం ఇచ్చారు. త్వరలో ఈ సినిమా షూటింగ్ రెగ్యూలర్ గా జరగబోతుందట. అయితే ఈ సినిమాలో ఇంటర్వెల్ కి ముందు వచ్చే సన్నివేశం ఒక రేంజ్ లో ఉండేలా ప్లాన్ చేస్తున్నారట.

ఇది ఒక భారీ పోరాట సన్నివేశామని తెలుస్తోంది. ఎన్టీఆర్ .. చరణ్ తో పాటు 2000 మంది జూనియర్ ఆర్టిస్టులు ఈ పోరాట సన్నివేశంలో పాల్గొననున్నట్టు సమాచారం. కేవలం ఈ ఒక్క పోరాట సన్నివేశం కోసం ఏకంగా 45 కోట్ల రూపాయలు ఖర్చు చేయబోతున్నారట. అంతే కాదు విజువల్ వండర్ గా అనిపించే ఈ సన్నివేశం ఈ సినిమా హైలైట్స్ లో ఒకటిగా నిలుస్తుందని అంటున్నారు. జూలై 30 2020లో ఈ సినిమాను విడుదల చేయనున్నారు.