RRR మూవీ లో తారక్ పక్కన మరో హీరోయిన్ ఎవరంటే ?

RRR మూవీ లో తారక్ పక్కన మరో హీరోయిన్ ఎవరంటే ?

0
107

RRR మూవీ వేగంగా చీత్రీకరణ జరుపుకుంటోంది, ఓపక్క సినిమా ఎప్పుడు వస్తుందా అని అభిమానులు ఎదురుచూస్తున్నారు..దర్శకధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి దర్శకత్వంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగాలుగా ఈ సినిమాలో నటిస్తున్నారు, భారీ తారగణంతో చిత్ర షూటింగ్ జరుపుకుంటోంది.

అయితే ఈ సినిమాలో మరో ఇంట్రస్టింగ్ అప్ డేట్ వినిపిస్తోంది, ఈ సినిమాలో తారక్ సరసన మరో హీరోయిన్ కూడా నటిస్తున్నారు అని వార్తలు వస్తున్నాయి…ఎన్టీఆర్ కోసం ఇప్పటికే ఇంగ్లండ్ నటి ఒలీవియా మోరిస్ను రాజమౌళి ఫైనల్ చేసిన సంగతి తెలిసిందే.

బ్రిటిష్ అమ్మాయిగా ఒలీవియా నటిస్తున్నారు. కాని కధలో ఓ గోండు తెగ అమ్మాయి కూడా భీమ్ను ఇష్టపడుతుందట. ఆ అమ్మాయి పాత్రలో ఓ నటిని ఫైనల్ చేశారు అని టాలీవుడ్ టాక్..ఐశ్వర్య రాజేష్ను రాజమౌళి ఈ పాత్ర కోసం తీసుకున్నారని అంటున్నారు.

కౌశల్య కృష్ణమూర్తి సినిమాతో టాలీవుడ్కు పరిచయమైన ఐశ్వర్య రాజేష్.. వరల్డ్ ఫేమస్ లవర్ చిత్రంలో సువర్ణ పాత్రతో అందరినీ కట్టిపడేశారు, ఇప్పుడు ఆమె నానితో టక్ జగదీష్ చిత్రం చేస్తున్నారు, వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు ఆమె. మరి టాలీవుడ్ లో ఈ వార్త అయితే వినిపిస్తోంది.