యావత్ ఇండియన్ సినీ పరిశ్రమ ఆర్.ఆర్.ఆర్ సినిమా కోసం వేయి కళ్లతో ఎదురుచూస్తోంది. బాహుబలిలాంటి సెన్సేషన్ సినిమా తర్వాత రాజమౌళి దర్శకత్వం వహిస్తున్న సినిమా కావడం.. ఎన్టీఆర్, రామ్ చరణ్ వంటి స్టార్ హీరోలు నటిస్తుండడంతో ఈ సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఈ అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా సినిమాను అత్యంత భారీ బడ్జెట్‌తో తెరకెక్కిస్తున్నారు రాజమౌళి.
నిజానికి ఇపాటికే ఈ సినిమా విడుదల కావాల్సి ఉండగా కరోనా కారణంగా వాయిదా పడుతూ వచ్చింది. తాజాగా తిరిగి షూటింగ్ ప్రారంభమైన ఈ సినిమా వేగంగా చిత్రీకరణ పూర్తి చేసుకుంటోంది. ఈ క్రమంలోనే ఈ సినిమాకు ఎలాంటి అప్‌డేట్ లేదని నిరుత్సాహపడుతోన్న సినీ లవర్స్‌కు రాజమౌళి తాజాగా ఓ ట్రీట్ ఇచ్చారు. ROAR OF RRR పేరుతో DVV వారు మేకింగ్ వీడియో విడుదల చేసారు ఈ రోజే. విడుదల చేసిన గంటల్లోనే లక్షల్లో వ్యూవ్స్ వచ్చాయి. ఆ వీడియో మీరు చూడండి.