రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్, రామ్ చరణ్ కాంబినేషన్ లో ఆర్ఆర్ఆర్ చిత్రం తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే… భారీ బడ్జెట్ తో రూపొందిస్తున్న ఈచిత్రంలో రామ్ చరణ్ అల్లు సీతారామరాజు పాత్రలో ఎన్టీఆర్ కొమరం భీమ్ పాత్రలో కనిపించనున్నారు…
వాస్తవానికి ఈ సినిమా షూటింగ్ పూర్తిచేసుకుని ఎప్పుడో రిలీజ్ అవ్వాల్సి ఉంది కరోనా కారణంగా విధించిన లాక్ డౌన్ కారణంగా షూటింగ్ ఆగిపోయింది… తాజాగా ఈ చిత్రం గురించి ఒక వార్త హల్ చల్ చేస్తోంది… సినిమా షూటింగ్ ను ఈ నెల 5 నుంచి హైదరాబాదులో నిర్వహించనున్నారని తెలుస్తోంది…
ఈ షెడ్యూల్ లో ముందుగా ఎన్టీఆర్ పాల్గొనే సన్నివేశాలను చిత్రీకరిస్తారని తెలుస్తోంది.. ఎందుకంటే ఇప్పటికే రామ్ చరణ్ సంబంధించిన టీజర్ చేసినప్పటికీ ఎన్టీఆర్ టీజర్ ను మాత్రం ఇంకా రిలీజ్ చేయలేదు… అందుకే ముందుకు ఎన్టీఆర్ సన్నివేశాలను షూట్ చేసే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు…