రాజమౌళి RRR అప్ డేట్స్….. షూటింగ్ డేట్ ఫిక్స్

రాజమౌళి RRR అప్ డేట్స్..... షూటింగ్ డేట్ ఫిక్స్

0
106

బాహుబలి సినిమా హిట్ తర్వాత దర్శకుడు రాజమౌళి ఆర్ఆర్ఆర్ చిత్రం చేస్తున్నాడు… ఈ చిత్రంలో స్టార్ హీరోలు అయిన ఎన్టీఆర్, రామ్ చరణ్ లు నటిస్తుండటంతో అంచనాలు భారీగా ఉన్నాయి… వాస్తవానికి అన్ని సజావుగా జరిగి ఉంటే ఈ చిత్రం దసరా కానుకగా లేదంటే దీపావళికి కానుగా విడుదలకావాల్సింది

కానీ కరోనా కారణంగా ఇంతవరకు షూటింగ్ కూడా పూర్తి కాలేదు… కరోనా కారణంగా సుమారు ఐదు నెలలపాటు షూటింగ్ నిలిచిపోయింది… అయితే తాజాగా కేంద్రం షరతులతో కూడిన పర్మీషన్లు ఇవ్వడంతో నెమ్మదిగా షూటింగ్ స్టార్ట్ చేస్తున్నారు… ఈ క్రమంలో దర్శకుడు రాజమౌళి పెండింగ్ లో ఉన్న షూటింగ్ పూర్తి చేయడానికి ప్లాన్ వేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి…

హీరోలు ఎన్టీఆర్, చరణ్ లతో చర్చించిన మీదట విజయదశమి తర్వాత షూటింగ్ ను ప్రాంభిస్తారట…. మొత్తం నాలుగు నెలల్లోనే షూటింగ్ పూర్తి చేసేయాలని దర్శకుడు రాజమౌళి షెడ్యూల్ పక్కాగా ప్లాన్ వేశారట…