ఆర్ ఆర్ ఆర్ సినిమాలో శ్రియ ఏ పాత్రో తెలుసా

ఆర్ ఆర్ ఆర్ సినిమాలో శ్రియ ఏ పాత్రో తెలుసా

0
96

ఆర్ ఆర్ ఆర్ సినిమా షూటింగ్ ఇప్పటికే చాలా వరకూ పూర్తి అవుతోంది.. షెడ్యూల్ షూటింగులతో వరుసగా బిజీగా ఉన్నారు జక్కన్న, ఇక తాజాగా ఆర్ ఆర్ ఆర్ లో నటి శ్రియ నటిస్తున్నారు అనే వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఇప్పటికే హీరోయిన్స్ ఫిక్స్ అయ్యారు కదా మరి శ్రీయ ఏ పాత్ర చేస్తారు అని ఆలోచిస్తున్నారా.

ఆర్ఆర్ఆర్ లో హిందీ హీరో అజయ్ దేవగణ్ కీలక పాత్ర పోషిస్తున్నారు. ఆయనకు జోడీగా శ్రియ కనిపించనున్నారు. దీంతో దర్శకుడు రాజమౌళి చిత్రాలు రెండు చిత్రాల్లో ఆమె నటించినట్లు అవుతుంది, గతంలో ఛత్రపతి సినిమాలో నటించారు, ఇప్పుడు అజయ్ దేవగణ్ సరసన నటిస్తున్నారు అని తెలుస్తోంది.

హిందీ దృశ్యం లో వీరిద్దరూ జంటగా నటించారు. మళ్లీ మరోసారి జంటగా నటిస్తున్న చిత్రమిది. ప్రస్తుతం వికారాబాద్ అడవుల్లో అజయ్ దేవగణ్, శ్రియపై సన్నివేశాలు తెరకెక్కిస్తున్నారని తెలిసింది. ఇక రామ్ చరణ్ ఎన్టీఆర్ పై దాదాపు 60 శాతం సీన్స్ షూటింగ్ అయ్యాయి అని తెలుస్తోంది, ఈ సినిమాని డీవీవీ దానయ్య నిర్మిస్తున్న సంగతి తెలిసిందే, అలాగే ఎన్టీఆర్ సరసన ఒలీవియా మోరిస్, చరణ్ సరసన ఆలియా భట్ నటిస్తున్నారు.