బల్గేరియాలో ‘ఆర్‌ ఆర్‌ ఆర్‌’

బల్గేరియాలో 'ఆర్‌ ఆర్‌ ఆర్‌'

0
99

రాజమౌళి దర్శకత్వంలో ‘ఆర్‌ ఆర్‌ ఆర్‌’ సినిమా రూపొందుతోంది. ఎన్టీఆర్‌ .. చరణ్‌ ప్రధానమైన పాత్రలను పోషిస్తోన్న ఈ సినిమా, ఇప్పటికే కొంతవరకూ చిత్రీకరణ జరుపుకుంది. తాజా షెడ్యూల్‌ ను ‘బల్గేరియా’లో ప్లాన్‌ చేశారు. ఈ రోజునే అక్కడ తాజా షెడ్యూల్‌ షూటింగ్‌ మొదలైంది.

ప్రధాన పాత్రల కాంబినేషన్లోని కొన్ని ముఖ్యమైన సన్నివేశాలను అక్కడ చిత్రీకరిస్తున్నారు. ఈ సన్నివేశాలు సినిమా హైలైట్స్‌ లో ఒకటిగా నిలుస్తాయని అంటున్నారు. ఒక వైపున ఎన్టీఆర్‌ అభిమానులు .. మరో వైపున చరణ్‌ ఫ్యాన్స్‌ ఈ సినిమా కోసం వేయికళ్లతో ఎదురుచూస్తున్నారు.

వచ్చే ఏడాది ప్రథమార్థంలో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. వివిధ భాషల్లో భారీ స్థాయిలో విడుదల చేయాలనే ఆలోచనలో దర్శక నిర్మాతలు వున్న విషయం తెలిసిందే.