‘RRR’ మూవీ యూఎస్ రివ్యూ..

'RRR' Movie First US Review ..

0
129

1920 నేప‌థ్యంలో సాగే క‌థ ఇది. నిజాం పరిపాలనలో ఉన్న తెలంగాణలోని ఓ గిరిజన ప్రాంతంలో ఈ కథ మొదలైంది.ఓ బ్రిటిష్ దొర ఓ గోండు పిల్లను బలవంతంగా తీసుకువెళ్తాడు. ఆ గోండు జాతి కాపరి కొమురం భీంకి(ఎన్టీఆర్) ఈ విషయం తెలుస్తోంది. కొమురం భీం తమగూడెం పిల్ల కోసం దొరల ఏలుబడిలో ఉన్న ఢిల్లీలో అడుగుపెట్టి అక్కడ విద్వంసం సృష్టించి ఆ పిల్లను రక్షిస్తాడు. దాంతో కొమురం భీం (ఎన్టీఆర్)ను ఎలాగైనా పట్టుకునే బాధ్యతను సీతారామరాజు (రామ్ చరణ్)కు అప్పగిస్తోంది బ్రిటీష్ ప్రభుత్వం. అయితే, రామరాజు కొమురం భీమ్ లోని నిజాయితీ, మంచితనం నచ్చి అతనికి సాయం చేస్తాడు. బ్రిటీష్ ప్రభుత్వానికి ఎదురు తిరిగినందుకు రామరాజుకు బ్రిటీషు ప్రభుత్వం మరణ శిక్ష విధిస్తుంది.

ఈ విషయం ఏమి తెలియని భీం అనుకోకుండా సీతను కలుసుకుంటాడు. ఆమె పెట్టిన సద్ది తిని ఆకలి తీర్చుకున్న భీం ఆమె కష్టానికి కరిగిపోతాడు. మనువాడిన వాడు ఉరికంభం ఎక్కబోతున్నాడని సీత కన్నీరు పెట్టుకుంటుంది. రామరాజు గురించి భీంకు మొత్తం నిజం తెలుస్తోంది. నీ భర్త రాముడు లాంటి వాడు, రాముడికి కష్టం వస్తే వెళ్లాల్సింది సీతమ్మ కాదు. ఈ లక్ష్మణుడు అంటూ కొమురం భీం మళ్లీ బ్రిటీష్ పై అటాక్ చేసి రామరాజును జైలు నుంచి తప్పిస్తాడు. ఇలా మొదలైన వీరి స్నేహం చివరకు ఎలాంటి మలుపు తీసుకుంది ? బ్రిటిష్ ప్రభుత్వం పై భీమ్, రామరాజు కలిసి ఏ విధంగా పోరాటం చేశారు ? అనేది మిగిలిన కథ.

ఎవరెలా చేశారంటే..?

నటి నటీనటుల విషయానికి వస్తే..నిప్పు, నీరు… అంటూ రెండు శ‌క్తుల్ని ప‌రిచ‌యం చేస్తూ సినిమాని ఆరంభించారు ద‌ర్శ‌కుడు. ఆ శ‌క్తుల‌కి త‌గ్గ‌ట్టే ఉంటాయి ప‌రిచ‌య స‌న్నివేశాలు. రామ్‌చ‌ర‌ణ్‌ని భారీద‌నంతో కూడిన‌, అత్యంత స‌హ‌జ‌మైన లాఠీఛార్జ్ యాక్ష‌న్ ఘ‌ట్టంతో ప‌రిచ‌యం చేసిన విధానం, అందులో ఆయ‌న న‌టించిన తీరు ప్రేక్ష‌కుల‌తో చ‌ప్ప‌ట్లు కొట్టిస్తుంది. ఆ త‌ర్వాత ఎన్టీఆర్ పులితో క‌లిసి చేసే విన్యాసాల‌తో క‌థ‌లోకి ఎంట్రీ ఇస్తారు. కథను బట్టి ఇద్దరి ఐడియాలజీ వేరు అయినా.. ఉత్తర, దక్షిణ ధృవాల్లా ఇద్దరు చెరో దారిలో తమ ప్రయాణం సాగించినా.. రెండు పాత్రల మధ్య బాండింగ్ ను రాజమౌళి చాలా గొప్పగా ఎలివేట్ చేశాడు.

RRR Movie First US Review

అయితే ఆ ఇద్ద‌రి మ‌ధ్య స్నేహం చిగురించిన‌ట్టుగానే, వైరం కూడా మొదల‌వుతుంది. రెండు శ‌క్తులు ఒక‌దానికొక‌టి త‌ల‌ప‌డితే అది ఎంత భీక‌రంగా ఉంటుందో చూపిస్తూ రామ‌రాజు, భీమ్ మ‌ధ్య స‌న్నివేశాల్ని తీర్చిదిద్దారు ద‌ర్శ‌కుడు. విరామానికి ముందు వ‌చ్చే ఆ స‌న్నివేశాలు సినిమాకే హైలైట్‌గా నిలుస్తాయి. రెండు పాత్రల మధ్య ఎమోషన్ మాత్రం చెక్కు చెదరలేదు. ఈ ఫైట్ సీక్వెన్స్ లో ఆడియెన్స్ కచ్చితంగా కన్నీళ్లు పెట్టుకుంటారు. హీరోలిద్దరూ తమ పాత్రల కోసం పడిన కష్టం అద్భుతం. ఆ విషయంలో ఇద్దరినీ మెచ్చుకోవాలి.

అలియా భట్ కూడా సీత పాత్రలో ఒదిగిపోయింది.. ఈ సినిమాలో మిగిలిన కీలక పాత్రల్లో నటించిన ఒలీవియా మోరిస్, అజయ్ దేవగన్ , శ్రీయా అలాగే మిగిలిన లార్జ్ స్టార్ కాస్ట్ కి వాళ్ళ రేంజ్ కి తగ్గ, క్యాలిబర్ నిలబెట్టుకునే పాత్రల్లో అద్భుతంగా నటించారు. అయితే, ఫస్ట్ హాఫ్ లో ఎన్టీఆర్ – చరణ్ ల ఇంట్రడక్షన్ సీక్వెన్స్, అలాగే విజువల్ ఎఫెక్ట్స్ అద్భుతంగా ఉన్నాయి. అసలు ఈ ఊహించని రీతిలో క్లైమాక్స్ ను డిజైన్ చేయడం నిజంగా గొప్ప విషయమే.

ఫైనల్ గా:

మొత్తంమీద ఈ చిత్రం ఒక విజువల్ వండర్. ఒక ఎమోషనల్ క్లాసిక్.. ఒక యాక్షన్ ఫీస్ట్. చివరగా ఒక్క మాటలో ‘ఆర్ఆర్ఆర్’ అబ్బుర పరుస్తోంది.