Review: ‘RRR’ రివ్యూ..సినిమా ఎలా ఉందంటే?

'RRR' Review..How is the movie?

0
97

రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన పాన్ ఇండియా చిత్రం ఆర్ఆర్ఆర్. ఈ సినిమాలో అల్లూరి సీతారామరాజు పాత్రలో రామ్ చరణ్.. కొమురం భీమ్ పాత్రలో ఎన్టీఆర్ కనిపించనున్నాడు. ఈ సినిమా కోసం తెలుగు రాష్ట్రాల్లో అభిమానులు నాలుగు ఏళ్ల నుంచి ఎదురు చూస్తున్నారు. కరోనా కారణంగా వాయిదా పడుతూ వచ్చిన ట్రిపుల్ ఆర్ నేడు ప్రపంచ వ్యాప్తంగా విడుదల కాబోతోంది. ఇప్పటికే బెన్ ఫిట్ షోలు పూర్తయ్యాయి. మరి ఎన్నో అంచనాల నడుమ విడుదలైన RRR సినిమా ఆకట్టుకుందా? ఇద్దరు స్టార్‌ హీరోలను ఎన్టీఆర్‌, రామ్‌చరణ్‌ ను దర్శకుడు రాజమౌళి ఏ విధంగా చూపించారు? ఈ రివ్యూ లో చూద్దాం..

కథ ఇదే..

నిజాం పరిపాలనలో ఉన్న తెలంగాణలోని ఓ గిరిజన ప్రాంతంలో ఆర్ఆర్ఆర్ కథ మొదలైంది. 1920 బ్రిటిష్ ప్రభుత్వంలో విశాఖపట్టణం సమీపానికి చెందిన రామరాజు (రామ్‌ చరణ్‌) పోలీస్ అధికారిగా పనిచేస్తుంటాడు. ఇక నిజాంను కలవడానికి వచ్చిన ఓ బ్రిటిష్ దొర (రే స్టీవెన్‌సన్‌) ఓ గోండు పిల్లను బలవంతంగా తీసుకువెళ్తాడు. ఇది అన్యాయమని ఎదిరించిన ఆ చిన్నారి కుటుంబాన్ని హింసిస్తారు. గోండు జాతికి కాపరి లాంటి కొమరం భీమ్ (ఎన్టీఆర్‌)కి ఈ విషయం తెలుస్తోంది. ఢిల్లీకి వెళ్లిన కొమురం భీమ్.. తమగూడెం పిల్ల కోసం దొరలపై తిరుగుబడి చిన్నారిని రక్షిస్తాడు. దాంతో కొమురంను ఎలాగైనా పట్టుకునే బాధ్యతను బ్రిటీష్ ప్రభుత్వం సీతారామరాజుకు అప్పగిస్తోంది. అయితే కొమురం నిజాయితీ, మంచితనం నచ్చిన రామరాజు అతనికి సాయం చేస్తాడు. బ్రిటీష్ ప్రభుత్వానికి ఎదురు తిరిగినందుకు రామరాజుకు బ్రిటీషు ప్రభుత్వం మరణ శిక్ష విధిస్తుంది. రామరాజును కొమురం కాపాడుతాడా లేదా?.. వీరి స్నేహం చివరకు ఎలాంటి మలుపు తీసుకుంది?.. బ్రిటిష్ ప్రభుత్వంపై ఏ విధంగా పోరాటం జరిగింది? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే..

ఎన్టీఆర్, చరణ్ యాక్టింగ్ నెక్స్ట్ లెవల్..

నిప్పు, నీరు… అంటూ రెండు శ‌క్తుల్ని ప‌రిచ‌యం చేస్తూ సినిమాని ఆరంభించారు ద‌ర్శ‌కుడు. ఆ శ‌క్తుల‌కి త‌గ్గ‌ట్టే ఉంటాయి ప‌రిచ‌య స‌న్నివేశాలు. రామ్‌చ‌ర‌ణ్‌ని భారీద‌నంతో కూడిన‌, అత్యంత స‌హ‌జ‌మైన లాఠీఛార్జ్ యాక్ష‌న్ ఘ‌ట్టంతో ప‌రిచ‌యం చేసిన విధానం, అందులో ఆయ‌న న‌టించిన తీరు ప్రేక్ష‌కుల‌తో చ‌ప్ప‌ట్లు కొట్టిస్తుంది. ఆ త‌ర్వాత ఎన్టీఆర్ పులితో క‌లిసి చేసే విన్యాసాల‌తో క‌థ‌లోకి ఎంట్రీ ఇస్తారు. ఇక అక్క‌డ్నుంచి ఆ రెండు పాత్ర‌లూ ప్రేక్ష‌కుల సొంతమైపోతాయి. అయితే ఆ ఇద్ద‌రి మ‌ధ్య స్నేహం చిగురించిన‌ట్టుగానే, వైరం కూడా మొదల‌వుతుంది. రెండు శ‌క్తులు ఒక‌దానికొక‌టి త‌ల‌ప‌డితే అది ఎంత భీక‌రంగా ఉంటుందో చూపిస్తూ రామ‌రాజు, భీమ్ మ‌ధ్య స‌న్నివేశాల్ని తీర్చిదిద్దారు ద‌ర్శ‌కుడు. విరామానికి ముందు వ‌చ్చే ఆ స‌న్నివేశాలు సినిమాకే హైలైట్‌గా నిలుస్తాయి. రామ్‌చ‌ర‌ణ్‌, ఎన్టీఆర్… ఇద్ద‌రూ పోటీప‌డి న‌టించారు. ఇక ‘నాటు నాటు’ పాటలో ఇద్దరూ కలిసి డ్యాన్స్ చేసిన తీరు మహా అద్భుతం.

ఇక బాలీవుడ్ స్టార్ అలియా భట్‌ సీత పాత్రలో ఒదిగిపోయింది. అజయ్ దేవగణ్ పాత్ర సినిమాకి కీలకం. శ్రియ సరన్ చిన్న పాత్రలో మెరిసినా ఆకట్టుకుంది. సముద్రఖని, రాహుల్ రామకృష్ణ, రావురమేష్ తదితరులు తమతమ పాత్రల పరిధి మేర చక్కటి నటన ప్రదర్శించారు.

ప్లస్ పాయింట్స్:

ఎన్టీఆర్, రామ్ చరణ్ నటన

రాజమౌళి మార్క్

కథ, పోరాట ఘట్టాలు

ఎం.ఎం.కీర‌వాణి సంగీతం నేప‌థ్య సంగీతం, పాట‌లు

సెంథిల్ కెమెరా ప‌నిత‌నం

మైనస్ పాయింట్స్:

ద్వితీయార్ధంలో కొన్నిచోట్ల సాగ‌దీత‌

క‌థ నిడివి ఎక్కువ‌ కావడం

రేటింగ్:

ALL TIME REPORT RATING -4.5/5