కోర్టుకు ‘ఆర్ఆర్ఆర్’ టీం? కారణం ఇదే..

'RRR' team to court? This is the reason ..

0
85

ఏపీ సినిమా టికెట్ ధరలపై ‘ఆర్ఆర్ఆర్’ చిత్ర యూనిట్ కోర్టును ఆశ్రయించబోతున్నారు అనే వార్తలు వచ్చాయి. తాజాగా ‘ఆర్ఆర్ఆర్’ చిత్ర నిర్మాత దానయ్య ఈ వార్తలపై స్పందించారు. ఏపీలో గత కొన్ని నెలలుగా థియేటర్ సమస్యలు, టికెట్ రేట్లపై చర్చలు, ఆన్లైన్ టికెటింగ్ అంటూ చర్చలు జరుగుతున్నాయి.

సినీ పరిశ్రమ నుంచి ఇప్పటికే నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్స్ మంత్రి పేర్ని నానిని కలిసి వారి సమస్యల్ని వివరించారు. థియేటర్స్ ని పూర్తిగా ఓపెన్ చేసినప్పటికీ టికెట్ ధరలపై ఇంకా చర్చలు నడుస్తున్నాయి. ఏపీ ప్రభుత్వం టికెట్ రేట్లు తగ్గించి ప్రభుత్వం ఆధ్వర్యంలోనే ఆన్లైన్ టికెటింగ్ జరపాలని చూస్తుంది. ఇదే జరిగితే సినిమా వసూళ్లు తగ్గడమే కాక, నిర్మాతలకు, డిస్ట్రిబ్యూటర్లకు నష్టాలే మిగులుతాయి. దీనిపై ఇప్పటికే సినీ ప్రముఖులతో చర్చలు జరిపారు.