Breaking: ‘RRR’ సినిమాకు వెళ్తుండగా ప్రమాదం..ముగ్గురు అభిమానుల దుర్మరణం

0
103

నేడు ప్రపంచవ్యాప్తంగా RRR సినిమా రిలీజ్ అయింది. ఈ సినిమాలో అల్లూరి సీతారామరాజు పాత్రలో రామ్ చరణ్.. కొమురం భీమ్ పాత్రలో ఎన్టీఆర్ కనిపించనున్నాడు. తమ అభిమాన హీరో సినిమాను చూడాలని అభిమానులు థియేటర్లకు క్యూ కడుతున్నారు.

తాజాగా ఈ మూవీ విడుదల నేపథ్యంలో ఓ విషాదం చోటు చేసుకుంది. ఆర్‌ఆర్‌ఆర్‌ సినిమా బెనిఫిట్‌ షోకు వెళుతున్న ముగ్గరు యువకులు రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. ఈ ఘటనలో ముగ్గురు యువకులు అక్కడిక్కడే మృతి చెందారు. ఈ ప్రమాదం చిత్తూరు జిల్లా వి. కోట దగ్గర చోటు చేసుకుంది.

ఆర్‌ఆర్‌ఆర్‌ సినిమా విడుదల సందర్భంగా అర్ధరాత్రి బెనిఫిట్‌ షో టికెట్ల కోసం వి. కోటకు వెళ్లిన వీరు టికెట్లు దొరకకపోవడంతో అక్కడ నుంచి వెనుదిరిగారు. ఆ సమయంలోనే ఎదురెదురుగా వస్తున్న రెండు బైకులు ఢీ కొట్టాయి. దీంతో ఆ ముగ్గురు యువకులు మరణించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు.