‘RRR’ అప్ డేట్: భీమ్ గ్లింప్స్ రిలీజ్

'RRR' Update..Did you see the beam glimpses?

0
117
RRR Update

ఎన్టీఆర్​, రామ్​చరణ్​ ప్రధాన పాత్రల్లో దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన సినిమా ‘ఆర్​ఆర్​ఆర్’. ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 7న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో చిత్ర ప్రచార కార్యక్రమాల వేగాన్ని పెంచారు.

ఇప్పటికే విడుదలైన ఈ సినిమా పోస్టర్లు, గ్లింప్స్​, ‘దోస్తీ’, ‘నాటు నాటు’, ‘జనని’ పాటలు అభిమానులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. డిసెంబరు 9న ‘ఆర్​ఆర్​ఆర్’​ ట్రైలర్​ విడుదల కానున్న నేపథ్యంలో ఈ ప్రచార చిత్రానికి సంబంధించిన గ్లింప్స్​ను విడుదల చేస్తూ ఫ్యాన్స్​కు సర్​ప్రైజ్​ ఇస్తోంది చిత్రబృందం.​

మంగళవారం రామ్​చరణ్​కు(రామ్​ పాత్ర) సంబంధించిన గ్లింప్స్​ను ఎన్టీఆర్​ విడుదల చేయగా.. నేడు(బుధవారం) తారక్​కు(కొమురం భీమ్​) సంబంధించిన గ్లింప్స్​ను రిలీజ్​ చేశారు చరణ్​. ఈ రెండు ట్రైలర్​పై అంచనాలను పెంచుతున్నాయి.